రజనీకాంత్ నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తే చాలనుకుంటారు ఫ్యాన్స్. కానీ వచ్చే ఏడాది మాత్ర సూపర్ స్టార్ నుంచి డబుల్ బొనాంజా రాబోతోంది. అది కూడా జస్ట్ 3 నెలల గ్యాప్ లో 2 సినిమాలతో సందడి చేయబోతున్నాడు రజనీ.
శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 2.0 సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా వచ్చిన 3 నెలలకే, అంటే 2018 సమ్మర్ ఎట్రాక్షన్ గా మరో సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు రజనీకాంత్. అదే కాలా సినిమా.
ప్రస్తుతం కాలా సినిమా 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇంకా 30 నుంచి 45 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ పార్ట్ ను 2 షెడ్యూల్స్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ చివరి వారానికి కాలా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో కాలా సినిమా థియేటర్లలోకి వస్తుంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ సరసన హుమా ఖురేషీ హీరోయిన్ గా నటిస్తోంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు నిర్మాత.