Advertisement


Home > Movies - Movie Gossip
తెలుగులోకి శతురంగ వేట్టై

తమిళంలో 2014లో వచ్చి, మంచి పేరు తెచ్చుకున్న థ్రిల్లర్ శతురంగ వేట్టై. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. ఓ బడా తమిళ సినిమా ఫైనాన్సియర్ ఈ సినిమాతో తెలుగు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఆయనతో కలిసి తెలుగులో శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక శివప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈయన గతంలో పలు సినిమాలు నిర్మించారు. ఏడాది క్రితం నాని-ఇంద్రగంటిల కాంబినేషన్ లో జెంటిల్ మన్ సినిమాను కూడా అందించారు.

శతురంగ వేట్టై తెలుగు వెర్షన్ కు హీరోగా సునీల్ ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సునీల్ రెండు సినిమాలు ఫినిష్ చేసి, విడుదలకు రెడీగా వుంచారు. ఒకటి ఉంగరాల రాంబాబు. ఈ సినిమా ఈ వారం విడుదలవుతోంది. మరో సినిమా టూ కంట్రీస్ విడుదలకు రెడీగా వుంది. అక్టోబర్ లేదా నవంబర్ ల్లో అది కూడా విడుదలవుతుంది. వచ్చే నెల నుంచి ఈ కొత్త సినిమా సెట్ మీదకు వెళ్తుంది.