షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా వున్న దశ నుంచి 'జవాన్' చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని సిట్యువేషన్ ఫేస్ చేస్తోంది. ఈ చిత్రానికి గౌరవ సమర్పకుని బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు రిలీజ్‌కి అడ్డం పడుతున్నాడనే పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1నే రావాల్సిన ఈ సాయి ధరమ్ తేజ్ చిత్రం ఇప్పుడు నవంబర్‌లో వస్తే గొప్పేనని చెప్పుకుంటున్నారు.
ఒక్క పాట షూటింగ్ బ్యాలెన్స్ వున్న ఈ చిత్రానికి ఆ మిగిలిన పాట చిత్రీకరణకి కూడా దిల్ రాజు అడ్డు చెబుతున్నాడట. మొత్తం రెడీ అయిపోతే రిలీజ్ చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది కనుక ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరా బరిలోకి కాస్త ఆలస్యంగా అయినా జవాన్ని విడుదల చేద్దామని చూసారు. అయితే దసరా చిత్రాలు మూడూ నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
థియేటర్ల సర్దుబాటు సమస్య వస్తుంది కనుక 'జవాన్'ని ఆపేసాడని, రీషూట్స్ చేయాలంటూ, మార్పులు చేయమంటూ అడ్డు తగులుతున్నాడని, దిల్ రాజు నుంచి 'గో ఎహెడ్' వస్తే తప్ప జవాన్ బోర్డర్ దాటడని అంటున్నారు. అయితే పండుగల సీజన్ వదిలేసి రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని జవాన్ టీమ్ ఆందోళన చెందుతోందట. కానీ బాల్ దిల్ రాజు కోర్టులో వుండేసరికి ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అట.