సర్వం జగన్నాధం!

పూరిజగన్నాధ్‌ దర్శకుడంటే మినిమం గ్యారెంటీ అనే ఇంప్రెషన్‌ వుండేది ఒకప్పుడు. పోకిరి, ఇడియట్‌ లాంటి మర్చిపోలేని కమర్షియల్‌ చిత్రాలని అందించిన పూరి జగన్నాథ్‌ 'పోకిరి' తర్వాత స్లైడ్‌ అయితూ వెళుతున్నాడు. పోకిరి తర్వాత పదకొండేళ్లలో…

పూరిజగన్నాధ్‌ దర్శకుడంటే మినిమం గ్యారెంటీ అనే ఇంప్రెషన్‌ వుండేది ఒకప్పుడు. పోకిరి, ఇడియట్‌ లాంటి మర్చిపోలేని కమర్షియల్‌ చిత్రాలని అందించిన పూరి జగన్నాథ్‌ 'పోకిరి' తర్వాత స్లైడ్‌ అయితూ వెళుతున్నాడు. పోకిరి తర్వాత పదకొండేళ్లలో పూరిజగన్నాధ్‌ నుంచి వచ్చిన చిత్రాల్లో విజయాలు చాలా తక్కువ. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు ఖచ్చితంగా చేసేసే పూరి ఈ వేగంలో పడి కథా విలువలు గాలికి వదిలేసాడు.

'పోకిరి'కి పది రోజుల్లోనే స్క్రిప్టు రాసా కనుక ఏ కథ మీద ఎక్కువ కష్టపడక్కర్లేదనేది పూరి థియరీ. అయితే అనుకోకుండా తగిలిన లాటరీని పట్టుకుని అన్నిటికీ అదే పద్ధతి పాటిస్తానంటే ఎలా కుదురుతుంది? ఎన్టీఆర్‌ నట విశ్వరూపం వల్ల ఒక మాదిరిగా ఆడిన టెంపర్‌ తీసేస్తే, బిజినెస్‌మేన్‌ తర్వాత వచ్చిన పూరి సినిమాలన్నీ ఫ్లాపులే. అతని తాజా చిత్రం పైసా వసూల్‌ కూడా డిజాస్టర్‌ దిశగా పయనిస్తోంది.

కథలు మారుస్తాడని చూస్తుంటే, హీరోలని, కాంబినేషన్లని మారుస్తూ తన గత వైభవాన్ని హీరోల డేట్స్‌ సాధించడానికి మాత్రం వాడుకుంటోన్న పూరిజగన్నాధ్‌ ప్రస్తుతం తనని ఎవరూ నమ్మని పరిస్థితికి చేరుకున్నాడు. మలి చిత్రాన్ని తనయుడు ఆకాష్‌తో తలపెట్టిన పూరి ఆ చిత్రంతో కనుక బౌన్స్‌ బ్యాక్‌ అవకపోతే ఇక కొత్తగా వచ్చిన హీరోలతో చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో.