మొన్నటి వరకు అతను తీసిందే సినిమా అన్నట్టు చెల్లిపోయింది కానీ వరుసగా రెండు భారీ పరాజయాలతో దిల్ రాజుకి కూడా జాగ్రత్త పెరిగింది. లవర్, శ్రీనివాస కళ్యాణం పరాజయాలు తన జోరుకి కళ్లెం వేయడంతో ఈ పరాజయాల పరంపరకి ఇంతటితో బ్రేక్ వేయడానికి దిల్ రాజు బాగా కష్టపడుతున్నాడు.
తన బ్యానర్ నుంచి తదుపరి రాబోయే 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రానికి దిల్ రాజు ఛాన్స్ తీసుకోవడం లేదు. ఎలాగైనా ఈ చిత్రంతో బౌన్స్‌బ్యాక్ అవ్వాలని చూస్తోన్న రాజు షూటింగ్ దశలో వుండగానే మార్పులు వుంటే చెప్పి, రీషూట్స్ చేయిస్తున్నాడట.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌లాంటి సూపర్ హిట్స్ తీసిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడి ట్రాక్ రికార్డ్‌పై భరోసాతో వదిలేయడానికి దిల్ రాజు ఇష్టపడడం లేదు. తన బ్రాండ్ నేమ్‌కి శ్రీనివాస కళ్యాణం చేసిన డ్యామేజ్‌కి 'హలో గురూ' సక్సెస్‌తో రిపేర్ చేయాలని చూస్తున్నాడు.
రామ్ కెరీర్ కూడా ఒడిదుడుకులతోనే సాగుతూ వుండడంతో ఈ చిత్రం విషయంలో రాజు అప్రమత్తంగా వున్నాడు. అసలే చాలా సినిమాలు పోటీ పడుతోన్న టైమ్‌లో వస్తోంది కనుక అతను ఛాన్స్ తీసుకోవట్లేదు.