షార్ట్ ఫిలిమ్స్ చేసుకునేవారికి మహత్తర అవకాశం అంటూ ఊదరగొట్టి, తొలి రోజు సాక్షిలో పూరి జగన్నాధ్ చెప్పిన కథకు జనం దిమ్మతిరిగిపోయిందట. ఇది షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ నా అంటున్నారు ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లు. అయినా పూరి ఏదో అవకాశం అంటున్నారని కిందా మీదా పడుతున్నారట.
నిజానికి ఈ లైన్ మాత్రమే తీసుకున్నా, ఎనిమిది నుంచి పది నిమిషాల సినిమా అవుతుందని, ఆయన చెప్పిన సినేరియానే తీసుకుంటే కనీసం అరగంట సినిమా అవుతుందని, షార్ట్ ఫిలిమ్ లు తీసేవారు అంటున్నారు. అయినా ఆ కాన్సెప్ట్ ఏమిటి అలా వుంది. తోడుతూనే రేప్, మర్డరు, సైకిక్ లాంటి రామ్ గోపాల్ వర్మ సబ్జెక్ట్ ఏమిటి అని బుర్ర గోక్కుంటున్నారు. నిజంగా పూరి అయిడియానేనా..లేక తెరవెనుక ఆర్జీవీ వుండి, ఇలాంటి వ్యవహారాలు చేయిస్తున్నారా అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆర్జీవీ అంటే పూరి కి యమా గౌరవం కదా.
ఇదిలా వుంటే టాలీవుడ్ లో మరో గుసగుస వినిపిస్తోంది. పరశురామ్, హరీష్ శంకర్ లాంటి చాలా మంది అసిస్టెంట్ లు వెళ్లి పోవడంతో పూరికి మాంచి క్రియేటివ్ బ్రెయిన్స్ అండ అవసరం పడినట్లుంది. అందుకనే ఈ వంకన కొంతమందిని ఎంపిక చేసి, తన దగ్గర ట్రైనీలుగా వుంచుకోవాలనుకుంటున్నారేమో..కొంతకాలం అలా వుంటే అవకాశాలు ఇస్తానని చెబితే ఎవరు కాదంటారు అన్నది ఆ గుసగుస సారాంశం,.