ఆయనో డైరక్టర్..అల్లప్పుడెప్పుడో సినిమాలు చేసాడు. ఫ్లాపులు చూసాడు. ఆ మధ్య పొరపాటునో, గ్రహపాటునో ఒక హిట్ కొట్టాడు. అక్కడి నుంచి ఇక హడావుడి ఆపడం లేదు.
అదిగో ఆ సినిమా, ఇదిగో ఈ సినిమా అంటూ తెగ హడావుడి. ఇది చాలదన్నట్లు పనిలో పనిగా భంగిమ వన్..భంగిమ టూ అంటూ తన ఫొటోలు వదలడం.
ఈ ప్రచారం పిచ్చి ఎంత పీక్స్ కు వెళ్లిందంటే ఆ మధ్య బర్త్ డే వచ్చింది. దానికి తనకు తానే వేరే పేర్లతో గూగుల్ యాడ్స్ కుమ్మేసాడు.
ఇందుకోసం పాతిక లక్షల వరకు ఖర్చుచేసినట్లు బోగట్టా. మరి ఈ అమౌంట్ నిర్మాత ఖాతాకు ఖర్చు రాసారా? ఆయనే స్వంత డబ్బు ఖర్చు చేసుకున్నాడో తెలియాల్సి వుంది.
ఈ పబ్లిసిటీ పిచ్చి చూసి, ఆ శ్రద్ద సినిమా మీద పెట్టి హిట్ కొడితే బెటర్ అప్పుడు ప్రచారం దానంతట అదే వస్తుంది అన్న కామెంట్ల ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.