బాలీవుడ్ లో చాన్నాళ్లుగా నడుస్తున్న ప్రేమకథల్లో ఒకటి టైగర్ ష్రాఫ్- దిశా పటానీల స్టోరీ. నాలుగేళ్ల నుంచి వీరి ప్రేమకథ సాగుతున్నట్టుగా ఉంది. మధ్యలో అప్పుడప్పుడు బ్రేకప్ వార్తలైతే వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. వీరు ఎంచక్కా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు.
అయితే వీరి ప్రేమ ఇప్పుడప్పుడే పెళ్లి పీటలెక్కేలా మాత్రం లేదు. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. బ్రేక్స్ లో ఎలాగూ టూర్లు, షికార్లు ఉండనే ఉన్నాయి. అలా అందమైన డేట్ లతో వీళ్లు గడిపేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రేమ పక్షులెన్నింటినో కరోనా డిస్ట్రబ్ చేసినట్టుగానే.. వీళ్లనూ కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా ఉంది.
అయితే ఇప్పుడు కూడా ఈ ప్రేమ జంట ఖుషీగా ఉందట. అదెలాగంటే..టైగర్ ష్రాఫ్ ఇంట్లోనే మకాం పెట్టిందట దిశా పటానీ కూడా. ప్రస్తుతం వీరు జంటగా ఉంటున్నారని, అది కూడా టైగర్ ఇంట్లోనే అని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది.
గతంలో దిశా పటానీ అంటే టైగర్ తల్లికి నచ్చలేదని, దిశను వదిలేయమని ఆమె కొడుకుకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు దిశ తన ప్రియుడి ఇంట్లో, అతడి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోందంటే.. వీరి ప్రేమకు ఇంట్లో ఆమోదం కూడా లభించేసినట్టేనేమో!