ఈ సారి సుకుమార్ ఐట‌మ్ గ‌ర్ల్ గా స్టార్ హీరోయిన్?

సుకుమార్ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ కు ఉండే ప్ర‌త్యేక‌త ఎంతో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్య ద‌గ్గ‌ర నుంచి సుక్కూ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ హిట్ అవుతూనే ఉన్నాయి. ఆ అంటే అమ‌లాపురంతో మొద‌లుపెట్టి.. జిగేల్ రాణి…

సుకుమార్ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ కు ఉండే ప్ర‌త్యేక‌త ఎంతో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్య ద‌గ్గ‌ర నుంచి సుక్కూ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ హిట్ అవుతూనే ఉన్నాయి. ఆ అంటే అమ‌లాపురంతో మొద‌లుపెట్టి.. జిగేల్ రాణి వ‌ర‌కూ స‌కుమార్ సినిమాల్లో ప‌లు ఐట‌మ్ సాంగ్స్ క‌ల్ట్ హిట్ అయ్యాయి.

ఆర్య 2, 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ జ‌నాల్లోకి పాకిపోయాయి. త‌న‌కు అలా అచ్చొచ్చిన ఐట‌మ్ సాంగ్స్ ను సుకుమార్ అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు కూడా. మొద‌ట్లో డ్యాన్స‌ర్లు, వ్యాంప్ త‌ర‌హా రోల్స్ చేసే వాళ్ల‌తో ఐట‌మ్ సాంగ్స్ ను చేసిన సుకుమార్ ఆ త‌ర్వాత యంగ్ హీరోయిన్ల‌తో కూడా ఐట‌మ్ సాంగ్స్ చేయిస్తూ వ‌స్తున్నాడు.

15 యేళ్ల నుంచి తెలుగు సినిమాల‌కు మ‌ళ్లీ ఐట‌మ్స్ త‌ప్ప‌నిస‌రి అయ్యే ట్రెండ్ కు కార‌ణాల్లో ఒక‌రైన సుకుమార్.. ఇప్పుడు త‌న లేటెస్ట్ సినిమాకు ఒక స్టార్ హీరోయిన్ చేత ఐట‌మ్ సాంగ్ చేయించ‌నున్నాడ‌ట‌. అది కూడా బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న దిశా ప‌టానీ చేత 'పుష్ప‌'లో ఐట‌మ్ సాంగ్ చేయించ‌నున్నాడ‌ట సుకుమార్. ఇది వ‌ర‌కూ దిశ తెలుగులో ఒక సినిమాలో న‌టించింది. 

ఆమెకు మరిన్ని తెలుగు అవ‌కాశాలు వ‌చ్చేవేమో కానీ, బాలీవుడ్ లో  బిజీ కావ‌డం.. భారీ రెమ్యూన‌రేష‌న్ రేంజ్ కు వెళ్లిపోవ‌డంతో తెలుగుకు దూరం  అయ్యింది. అయితే ఒకే సాంగ్ కు కాబ‌ట్టి త‌క్కువ డేట్సే అవ‌స‌రం ఉంటుంది, భారీ బ‌డ్జెట్ సినిమా కాబ‌ట్టి రెమ్యూన‌రేష‌న్ కూ లోటు ఉండ‌దు. కాబ‌ట్టి దిశా ప‌టానీ సుకుమార్ సినిమాలో చిందేయ‌డం ఖాయ‌మేనేమో!

చంద్రబాబు మీద కొత్త పిట్టకథ చెప్పిన బుగ్గన