దియా లవర్స్‌ ఉన్నారా? ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ!!

దియామీర్జా అంటే కుర్రకారులో ఒక సెక్షన్‌ వెర్రెత్తిపోతారు. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఒకనాటి మిస్‌ ఏసియా పసిఫిక్‌ ! తన సెక్సీ అందాలతో కుర్రకారు హృదయాల్లో బాగానే తిష్ట వేసింది. నవతరం కుర్రాళ్లలో ఆమెకు…

దియామీర్జా అంటే కుర్రకారులో ఒక సెక్షన్‌ వెర్రెత్తిపోతారు. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఒకనాటి మిస్‌ ఏసియా పసిఫిక్‌ ! తన సెక్సీ అందాలతో కుర్రకారు హృదయాల్లో బాగానే తిష్ట వేసింది. నవతరం కుర్రాళ్లలో ఆమెకు కూడా స్టార్‌ ఫాలోయింగ్‌ ఉన్నదనడంలో సందేహం లేదు. అందాల ప్రదర్శనలో అభ్యంతరాలు లేకుండా ఆకట్టుకుంటూ ఉండే ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసేసుకుంటోంది. అదేంట్రా బాబూ.. దశాబ్దాల తరబడి సినీ ఇండస్ట్రీలో తిష్టవేసుకుని.. పెళ్లి చేసుకుంటే మార్కెట్‌ పడిపోతుందనే భయంతో నాయికలు అనేకమంది వెనకాడుతోంటే.. ఈ అమ్మడు అప్పుడే మూడుముళ్లకు సిద్ధమవుతోందేమిటా అని అనుకుంటున్నారు కదా! నిజమే!

ఎంత అందగత్తె అయినా ఇప్పుడు దియామీర్జాకు ఉన్న మార్కెట్‌ మరీ అంత గొప్పగానూ లేదు. అలాగని ఆమె వెర్రి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే అమెరికాలో వ్యాపార రంగంలో బాగా స్థిరపడి ఉన్న సాహిల్‌ సంగా అనే కుర్రాడిని తన భాగస్వామిగా ఎంచుకున్నది కాబట్టి. 

ఇప్పుడు జీవిత భాగస్వామి కాబోతున్నవాడు.. ఆల్రెడీ ఆమెకు వ్యాపార భాగస్వామిగా ఉన్నాట్ట. ఇద్దరికీ ఉమ్మడి వ్యాపారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పింది. ఇటీవలే సాహిల్‌ సంగాతో దియా మీర్జా నిశ్చితార్థ: కూడా న్యూయార్క్‌లో చాలా ఘనంగా జరిగిందిట. 

దియామీర్జా మన సికింద్రాబాద్‌కు చెందిన అమ్మాయే. ఈమె హీరోయిన్‌ అయ్యాక.. ఇదే సంగాతో కలిసి ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించి రెండు సినిమాలు తీసింది. ప్రస్తుతం అతడితోనే జీవితాన్ని పంచుకుంటోంది. ఇక సినిమాలు చేయడం మానేసినా.. తీయడంలో బిజీగా అవుతుందో ఏంటో మరి!!