ఇస్మార్ట్ శంకర్ సినిమా దిగ్విజయంగా ఫస్ట్ వీక్ ఫినిష్ చేసింది. తొలివారం వరల్డ్ వైడ్ గా దాదాపు పాతిక కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ ఇంకా అంతో ఇంతో షేర్ వస్తోంది ప్రతిచోటా. సినిమాను తక్కువరేట్లకే అమ్మడం, సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో, బయ్యర్లకు లాభాల పంట పండినట్లు అయింది. అయితే ప్రతిచోటా ఎన్ఆర్ఎ పద్దతిలో అమ్మారు కాబట్టి, మొత్తం లాభాలు అన్నీ బయ్యర్లకే వస్తాయి అని అనుకోవడానికి లేదు. అయితే ఇరవైశాతం కమిషన్, ఆపై ఓవర్ ఫ్లోస్ లో వాటా కలిపి బయ్యర్లకు మంచి మొత్తాలే వస్తాయి.
ఇస్మార్ట్ శంకర్ దాదాపు ప్రతి ఏరియాలో కొన్నదానికి డబుల్ చేయడం విశేషం. సినిమాను ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ కలిపి 14.5 కోట్ల మేరకు విక్రయిస్తే, పాతికకోట్ల వరకు షేర్ వచ్చింది. తొలివారం వసూళ్లు ఇలా వున్నాయి.
రామ్ కెరీర్ లో ఫస్ట వీక్ ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి కావచ్చు. అలాగే ఇటీవలి కాలంలో ఓ మీడియం సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు రావడం కూడా ఇదే. నిర్మాత చార్మి ముందుగా ఈ సినిమాను 20 కోట్ల రేషియోలో అమ్మాలని అనుకున్నారు. ఆమె సినిమా స్టామినాను సరిగ్గానే అంచనా వేసారు. అయితే పూరి,రామ్ ట్రాక్ రికార్డుల వల్ల బయ్యర్లు ఆ రేట్లకు ముందుకురాలేదు. దాంతో తగ్గించే అమ్మాల్సి వచ్చింది.
నైజాం………11.10 కోట్లు
సీడెడ్……… 4.20
ఉత్తరాంధ్ర…3.00
ఈస్ట్…………1.62
వెస్ట్………….1.33
కృష్ణ…………1.59
గుంటూరు….1.67
నెల్లూరు……..0.85