చరణ్‌తో అయినా సరిగా చేసాడా?

దేవిశ్రీప్రసాద్‌ ఈమధ్య చేసిన పాటలు వింటుంటే ఏ పాట ఎందులోదో చెప్పలేనంత కష్టంగా వుంటున్నాయి. ఒకటి రెండు ట్యూన్లని తిప్పి తిప్పి చేస్తోన్న దేవి ప్రతి సినిమాతో తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఈమధ్య కాలంలో…

దేవిశ్రీప్రసాద్‌ ఈమధ్య చేసిన పాటలు వింటుంటే ఏ పాట ఎందులోదో చెప్పలేనంత కష్టంగా వుంటున్నాయి. ఒకటి రెండు ట్యూన్లని తిప్పి తిప్పి చేస్తోన్న దేవి ప్రతి సినిమాతో తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఈమధ్య కాలంలో అతని పాటలు రెండు నెలలకి మించి ఎక్కడా వినిపించడం లేదు.

ఒకప్పుడు చిరకాలం నిలిచిపోయే పాటలు చేసిన స్వరకర్తకి ఏమైందిపుడు అనే అనుమానం అందరికీ కలుగుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవికి వచ్చే ఏడాది చాలా కీలకం. రంగస్థలం, భరత్‌ అనే నేను తదితర భారీ చిత్రాలకి పని చేస్తున్నాడు. ఆ చిత్రాలకి ఇప్పటిలానే బ్యాడ్‌ మ్యూజిక్‌ ఇస్తే మాత్రం తెలుగు సినిమాకి నంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వున్న పేరు పోతుంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో చేసే సినిమాలకి మంచి పాటలు చేసే దేవికి 'రంగస్థలం' చాలా కీలకమవుతుంది. మరి రామ్‌ చరణ్‌ చిత్రానికి దేవి తన పూర్వ వైభవం తిరిగి తెచ్చుకునే పాటలే చేసాడా లేదా అన్నది చూడాలి.

ఒక విధంగా అతడిని ఇన్‌స్పయిర్‌ చేసిన కథలు, సినిమాలు ఈమధ్య లేవనాలి. పూర్తిగా ఒకే మూస సినిమాలు చేయడం వల్లే దేవి మ్యాజిక్‌ మిస్‌ అవుతుందేమో అని వాదించే వాళ్లున్నారు. రంగస్థలం అన్ని విధాలా డిఫరెంట్‌ సినిమా కనుక దీంతో దేవి అసలు టచ్‌లో వున్నాడా లేదా అనేది తేలిపోతుంది.