ఏవండోయ్‌ నాని గారు… అదరగొట్టేసారు!

బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని స్వయంకృషితో, ప్రతిభతో పైకొచ్చాడు. మొదట్లో రాంగ్‌ స్టెప్స్‌ వేసినా కానీ 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం నుంచి నాని కెరీర్‌ కుదురుకుంది. అప్పట్నుంచి నిలకడగా విజయాలు…

బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని స్వయంకృషితో, ప్రతిభతో పైకొచ్చాడు. మొదట్లో రాంగ్‌ స్టెప్స్‌ వేసినా కానీ 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం నుంచి నాని కెరీర్‌ కుదురుకుంది. అప్పట్నుంచి నిలకడగా విజయాలు సాధిస్తోన్న నాని ప్రతి సినిమాతో ఫాలోయింగ్‌ పెంచుకుంటూ పోతున్నాడు.

రెండు, మూడేళ్ల క్రితం అతని సినిమాలకి గ్యారెంటీ వసూళ్లు వచ్చేవి కావు. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' లాంటి సక్సెస్‌ఫుల్‌ టాక్‌ వచ్చిన సినిమా కూడా బ్రేక్‌ ఈవెన్‌ కాలేకపోయింది. కానీ ఇప్పుడు నాని సినిమాలకి ఓపెనింగ్స్‌ అదిరిపోతున్నాయి. 'నేను లోకల్‌', 'నిన్ను కోరి' చిత్రాలతో బయ్యర్లకి అతనిపై నమ్మకం రెండింతలైంది.

నిన్న మొన్నటి వరకు ఇరవైకోట్ల రేంజిలో వున్న అతని థియేట్రికల్‌ మార్కెట్‌ ఇప్పుడు ముప్పయ్‌ కోట్లకి చేరింది. తాజాగా 'ఎంసిఏ' చిత్రంతో నాని కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ చిత్రానికి వచ్చిన ఫస్ట్‌ డే షేర్స్‌ చూసి ట్రేడ్‌ పండితులే విస్మయం చెందారు.

ఈ క్రేజ్‌కి సాయిపల్లవి ఫ్యాక్టర్‌ కూడా తోడయింది కానీ ఒక సినిమాకి పుల్‌ ఎప్పుడూ హీరోదే. సినిమా టాక్‌ మిక్స్‌డ్‌గా వున్నా కానీ ఓపెనింగ్స్‌ ఘనంగా రాబట్టిన నాని ఈ చిత్రాన్ని సేఫ్‌ జోన్‌లోకి తీసుకెళ్లేలానే వున్నాడు.