దుమ్ము లేపేసిన జై రావణ

ఈ జనరేషన్ లో నవరసాలు పండించగలిగిన హీరో అని అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ నే. ఇందులో మిగిలిన ఫ్యాన్స్ ఫీల్ కావడానికి లేదు. అతి శయోక్తి అంతకన్నా లేదు. ఆ…

ఈ జనరేషన్ లో నవరసాలు పండించగలిగిన హీరో అని అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ నే. ఇందులో మిగిలిన ఫ్యాన్స్ ఫీల్ కావడానికి లేదు. అతి శయోక్తి అంతకన్నా లేదు. ఆ లుక్, ఆ వాయిస్, ఆ నటన అతనికి అలా వారసత్వంగా వచ్చేసాయి.

అందుకే మూడు రకాల పాత్రలను ఒకే సినిమాలొ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అందులోనూ నెగిటివ్ షేడ్ పాత్రను పోషించడానికి రెడీ అయిపోయాడు. నెగిటివ్ షేడ్ అంటే మళ్లీ సాదా సీదా కాదు, ఏకంగా రావణుడి లాంటి విలనిజం పండించడానికి ఫిక్సయిపోయాడు.

ఈ విషయాన్ని ఈ రోజు విడుదల చేసిన జై లవకుశ తొలి టీజర్ క్లియర్ గా చెప్పింది. అసురుడు రావణుడిగా ఎన్టీఆర్ తన సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైపోయింది. పైగా జై క్యారెక్టర్ లో వేరియేషన్ కేవలం లుక్ లోనే కాదు, డిక్షన్ లో కూడా చూపించాడు.

ఇప్పటి దాకా ఈ మాడ్యులేషన్ ఎన్టీఆర్ గొంతులో వినపడలేదు. కొత్తగా ట్రయ్ చేసినట్లుంది. మొత్తం మీద జైలవకుశ బజ్ ను పెంచేరేంజ్ లోనే విడుదల చేసారు టీజర్ ను.