డస్కీ బ్యూటీ గ్లామరస్‌ పాట్లు

బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు, తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. అదే ‘టక్కరిదొంగ’. మహేష్‌ సరసన ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బిపాసా, బాలీవుడ్‌లో మాత్రం ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్‌. ఇప్పుడూ ఒకటీ…

బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు, తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. అదే ‘టక్కరిదొంగ’. మహేష్‌ సరసన ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బిపాసా, బాలీవుడ్‌లో మాత్రం ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్‌. ఇప్పుడూ ఒకటీ అరా సినిమాలైతే చేస్తోందిగానీ, మునుపటి జోరు ఆమె కెరీర్‌లో లేదిప్పుడు.

కెరీర్‌లో వేగం తగ్గినప్పుడల్లా హాట్‌ హాట్‌ ఫొటోసెషన్లతో దర్శక నిర్మాతల దృష్టిని తనవైపుకు తిప్పుకున్న బిపాసా బసుకి, ఈ మధ్య ఆ గ్లామరస్‌ స్టంట్స్‌ కూడా వర్కవుట్‌ కావడంలేదు. అయినా బిపాసా తనదైన స్టయిల్లో ఫొటోసెషన్లతో దర్శక నిర్మాతలు తనవైపుకు చూడకపోతారా.. అనే ప్రయత్నాలైతే కొనసాగిస్తూనే వుంది.

తాజాగా బిపాసా హాట్‌ హాట్‌గా ఫొటోసెషన్‌కి పోజులిచ్చేసింది. ఇంకేముంది.. ఒకటీ అరా ఆఫర్లు ఆమె తలుపు తడ్తున్నాయట. బిపాసా మాత్రం, అవన్నీ చిన్న చిన్న సినిమాలనీ.. పెద్ద ఆఫర్స్‌ అయితేనే చేస్తాననీ వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకుంటోందని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. బిపాసా మాత్రం, సినిమాల ఎంపికలో తానెప్పుడూ చిన్నా పెద్ద అన్న తేడాల్ని చూడలేదని చెబుతోంది.