రాజ్ కుమార్ హీరానీ సంజయ్ దత్‌కు సన్నిహితుడే. దత్‌తో క్లాసిక్స్ తీసిన దర్శకుడే. అయితే దర్శకుడిగా అతడికంటూ ఒక స్కూల్ ఉంది. సంజయ్ దత్ బయోపిక్ విషయంలో హీరానీ దత్ కు స్నేహితుడిగా వ్యవహరించలేదు. ఆ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడట. అంటే.. స్నేహితుడు అనే మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా, ఏదో దత్ ఇమేజ్ మేకోవర్ కోసం బయోపిక్ అన్నట్టుగా కాకుండా.. నిజాలను నిక్కచ్చిగా చూపించడానికి హీరానీ అస్సలు మొహమాటపడలేదు అని అంటున్నారు బాలీవుడ్ జనాలు.
సినిమాలో దత్ డార్క్ హిస్టరీని కూడా చూపించారని సమాచారం. ప్రత్యేకించి దత్‌ను ఒక సెక్స్ అడిక్ట్, డ్రగ్ అడిక్ట్ గా చూపించే ఎపిసోడ్లలో హీరానీ మొహమాటమే పడలేదని టాక్. అమ్మాయిల విషయంలో దత్ చాలా కన్నింగ్ అని, వాళ్లను ఇంప్రెస్ చేయడానికి, పడకగదికి తీసుకెళ్లడానికి చాలా వేషాలు వేశాడని హీరానీ స్వయంగా చెప్పడం గమనార్హం.
ఒక అమ్మాయితో ఎమోషనల్ గా టచ్ కావడానికి తనను శ్మశానానికి తీసుకెళ్లాడట. ఆమె ఎందుకని అడిగితే..తన తల్లి సమాధి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పాడట. దీంతో ఆమె ఫిదా అయిపోయింది. వాస్తవానికి ఆ శ్మశానంలో ఎక్కడ దత్ తల్లి నర్గీస్ సమాధి లేనేలేదట. జస్ట్ ఆ అమ్మాయిని పడేయడానికి చేసిన పని అది! ఇలా ఉండేదట సంజయ్ దత్ తీరు.
హీరోగా నిలదొక్కుకున్నాకా సంజయ్ దత్ ఏ హీరోయిన్‌నీ వదల్లేదట! అప్పట్లో ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్లందరినీ టచ్ చేసిన నేపథ్యం ఉందట ఈ హీరోకి. తన కన్నా ముందు బాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్లను కూడా దత్ వదల్లేదట. తన హయాంలో జూనియర్ హీరోయిన్లను అయితే ఇక వదిలే సమస్యే లేదని చెబుతున్నారు దత్ గురించి. దత్ ఒక సెక్స్ అడిక్ట్ అని. ఏ హీరోయిన్‌నీ వదల్లేదు అనే అంశాన్ని కూడా సంజూలో చూపారని వార్తలు వస్తున్నాయి. సంజయ్ దత్ శృంగారలీలలు బహిర్గతం అవుతున్నాయనమాట.