ఇంటిలిజెంట్ లాంటి దారుణ పరాజయం చవి చూసిన తరువాత దర్శకుడు వివి వినాయక్ కు తరువాత ఏంటీ అన్నది క్లియర్ గా తెలియడం లేదు. బాలకృష్ణతో పెద్ద సినిమా చేయాలని ప్రయత్నం. బాలయ్య క్లారిటీగానే వున్నారు. సరైన కథ తెస్తే, చేసేద్దాం అని. అదే వినాయక్ కు పెద్ద సమస్య. ఆకుల శివ కథలు తప్ప ఆయన దగ్గర వేరేవి చెల్లుబాటు కావడం అంత సులువు కాదు. ఇంటిలిజెంట్ టైమ్ లో కూడా అలా చాలా కథలు వచ్చినా, ఓకె కాలేదు. ఇప్పుడూ అదే సమస్య.
ఇదిలా వుంటే ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలయ్య నేరుగా బోయపాటి సినిమా మీదకే వెళ్లిపోతున్నారని క్లారిటీగా తెలుస్తోంది. బోయపాటి తను చేస్తున్న సినిమా తరువాత బాలయ్యతోనే చేస్తానని క్లియర్ గా చెబుతున్నారు. అంటే సంక్రాంతి వేళకు బోయపాటి, బాలయ్య ఇద్దరూ ఫ్రీ అవుతారు. సినిమా మీదకు వెళ్లారు.
మరి వినాయక్ పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు కథ ఓకే కాలేదు. ఓకె చేయించుకోగలిగినా, బోయపాటి సినిమా తరువాతే. అంటే వచ్చే ఏడాది రెండో భాగంలో అన్నమాట. ఈ లోగా చేద్దామన్నా, కనుచూపు మేరలో హీరోలు ఎవ్వరూ కనిపంచడం లేదు.