దువ్వాడ.. కెవ్వు కామెడీ అట

అల్లు అర్జున్ మంచి కామెడీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. సరైనోడులో ఊర మాస్ గా కనిపించిన బన్నీ, ఫుల్ లెంగ్త్ కామెడీ పంచ్ లు విసురుతుంటే ఎలా అనిపిస్తుంది. వీటికి సమాధానమే డీజే…

అల్లు అర్జున్ మంచి కామెడీ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. సరైనోడులో ఊర మాస్ గా కనిపించిన బన్నీ, ఫుల్ లెంగ్త్ కామెడీ పంచ్ లు విసురుతుంటే ఎలా అనిపిస్తుంది. వీటికి సమాధానమే డీజే సినిమా అంటున్నారు. అవును.. దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అట. ఎంత కామెడీ అంటే క్లయిమాక్స్ కూడా సింపుల్ గా, సరదాగా ఉంటుందట.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో యాక్షన్ పార్ట్ కంటే, సెటైరిక్ పంచ్ లు, కామెడీనే ఎక్కువగా ఉంటాయట. సో.. కథ ప్రకారం క్లైమాక్స్ ను కూడా సరదా సన్నివేశాలతో నింపేశారని టాక్. బన్నీ సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి కామెడీ క్లయిమాక్స్ ఎక్కడా లేదు. చివరికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా క్లయిమాక్స్ లో ఫైట్ పెట్టారు. కానీ డీజే మాత్రం క్లయిమాక్స్ లో యాక్షన్ కంటే కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు.

డీజేలో బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ క్యారెక్టరే కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఇంటర్వెల్ తర్వాత కాస్త యాక్షన్ చూపించినా, మళ్లీ కామెడీలోకి షిఫ్ట్ అయిపోతాడట బన్నీ. అంటే సరైనోడులా మాస్ సినిమా కాకుండా, డీజే అనేది ఓ కూల్ ఎంటర్ టైనర్ అన్నమాట. ఇప్పటికే పాటల రిలీజ్ తతంగం మొదలైంది. వచ్చేనెల 23న డీజే థియేటర్లలోకి వస్తాడు.