Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఏడుస్తున్న' పోస్టర్

'ఏడుస్తున్న' పోస్టర్

ఏడుస్తున్న పోస్టర్ అంటే పోస్టర్ ఏడవడం కాదు. హీరో ఏడుస్తున్న చిత్రంతో కూడిన పోస్టర్. మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ తొలి సినిమా విజేత తొలి సింగిల్ పోస్టర్ బయటకు వదిలారు. కోడికి సంతాపం అంట. కొక్కరొక్కొ అనే పాట అంట. వాటి సంగతి ఏమో కానీ, ఎంచి ఎంచి మరీ ఈ స్టిల్ తో పోస్టర్ తయారుచేసినట్లు కనిపిస్తోంది.

అసలే మెగా బృందం నుంచి వస్తున్న మరో హీరో. కాస్త అందంగా చూపించేందుకు ప్రయత్నించాలి కానీ, మరీ ఇలా ఎంచి ఎంచి ఏడుస్తున్న పోస్టర్ వదలడం ఏమిటో? ఈ ఐడియా డైరక్టర్ కు ఎలా వచ్చిందో కానీ మెచ్చుకొవాలి. స్టార్ట్ చేస్తూనే ఇలా ఏడుపు పోస్టర్ ను వదలుతున్నాం అని మెగా మామగారు చిరంజీవికి చెప్పారో లేదో? ఆయన చూసి కూడా ఈ పోస్టర్ ఓకె చేసి వుంటే, ఏదో విషయం వుంది అనుకోవాలి.

ఎప్పుడో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ‘వంకాయ’ మీద సిరివెన్నెలతో మాంచి సాంగ్ చేయించారు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ ఆ పాట. మరి ఇప్పుడు తొలిసారి నాన్ వెజ్ మీద అదీ చాలా మంది ఇష్టపడే చికెన్ పాట చేయించినట్లుంది. అది ఎలా వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?