Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శివగామి రెమ్యూనిరేషన్ తెలుసా?

శివగామి రెమ్యూనిరేషన్ తెలుసా?

క్లిక్ కావాలే కానీ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లకు మాంచి రెమ్యూనిరేషన్లు వుంటాయి. సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ ఇప్పుడు రోజుకు లక్షన్నర నుంచి ఆ పైన తీసుకుంటున్నారు. రావురమేష్ రెండున్నర లక్షల వరకు తీసుకుంటున్నారు. మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ మూడు నుంచి నాలుగు లక్షలు రోజుకు తీసుకుంటున్నారు. వెన్నెల కిషోర్ రోజుకు లక్షన్నర వరకు తీసుకుంటున్నారు.

ఇలా రోజువారీ కాల్ షీట్ ల లెక్కల్లో మంచి రెమ్యూనిరేషన్లు అందుకుంటున్నారు. ఎటొచ్చీ డిమాండ్ వుండాలంతే. అయితే శివగామి ‘రమ్యకృష్ణ’ రోజువారీ కాల్ షీట్ రెమ్యూనిరేషన్ వీరందరికన్నా ఎక్కువ. ముఖ్యంగా ఆమెను కాంట్రాక్టు ఛేసారు అంటే, ఆమె మాత్రమే చేయగలిగిన,, ఆమె మాత్రమే సూటయ్యే పాత్ర అయి వుంటుంది. అందులో సందేహం లేదు.

అందుకే ఆమె ఓ రేంజ్ లో డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ ‘శైలజరెడ్డి అల్లుడు’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం 25 రోజుల కాల్ షీట్లు తీసుకున్నారు. సినిమా టైటిల్ నే ఆమె మీద వుంది అంటే సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకం అయి వుంటుందో చెప్పనక్కరలేదు.

అందుకే ఈ సినిమాకు ఆమె ఆరు లక్షల వరకు రోజువారీ కాల్ షీట్ కు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే కోటిన్నర బిల్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు టాప్ హీరొయిన్లు కూడా చార్జ్ చేయనంత అన్నమాట. రకుల్  లాంటి టాప్ హీరోయిన్ల రెమ్యూనిరేషన్ మాత్రమే కోటి దాటింది. ఫేడవుట్ అవుతున్న తమన్నా లాంటి వారు 65 లక్షలు రేంజ్ లోనే వున్నారు.

అలాంటిది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ రేంజ్ లో చార్జ్ చేయడం అంటే సూపరే. విజయశాంతి ఈ విధంగా తన కెరీర్ ను మలుచుకోలేకపోయారు. పాలిటిక్స్ లోకి వెళ్లి, అటు ఇటు కాకుండా అయిపోయారు. లేదూ అంటే ఆమె కూడా ఇలాంటి క్యారెక్టర్లకు పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యేవారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?