ఎవరు దొరక్క పోతే, ఎవరూ చేయకపోతే..ఏం చేయాలి. మనవాళ్లే ఎవరో ఒకరు పూనుకోవాలి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రీమేక్ సినిమా యామిరుక్కు భయమే పరిస్థితి ఇలాగే వుంది. హర్రర్ కామెడీ జోనర్ సినిమా ఇది. తమిళంలో చిన్న సినిమాగా విుడుదలై పెద్ద హిట్ అయింది. అయితే సినిమాలో హీరోయిజం వుండదు. వారసత్వంగా తండ్రి పెద్ద బంగ్లా వదిలాడని తెలిసి, దాంట్లో లాడ్జీ పెట్టి, దెయ్యాలతో నానా బాధ పడతారు హీరో, అతగాడి మిత్రుడు.
ఈ సినిమా హక్కులు స్టూడియో గ్రీన్ నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆ డీవీడీ చాలా మంది హీరోల ఇళ్లకు చేరింది. అల్లరి నరేష్, నిఖిల్..ఇలా..బన్నీ వాసు ఎలాగైనా నిఖిల్ తో చేయాలనుకున్నాడు కానీ అతగాడు నో అన్నాడు. ఇలా ఎవరూ సరైన హీరో దొరక్కపోవడంతో, సరే ఎలాగూమన హీరో వున్నాడు కదా అని అల్లు శిరీష్ తో కానిచ్చేయాలనుకుంటున్నారని వార్త వినిపిస్తోంది.
తప్పదు మరి. ఎలాగూ రీ మేక్ రైట్లు వున్నాయి. హీరో వున్నాడు. చిన్న సినిమా. ఓ భవంతి, పది మంచి చిన్న ఆర్టిస్టులు వుంటే చాలు. కోటి నుంచి రెండు కోట్లలో కానిచ్చేయచ్చు..శాటిలైట్ కు మన మాటీవీ వుండనే వుంది. అయితే కొసమెరుపు ఏమిటంటే..తాను ఈ సినిమా చేయడం లేదంటూ అల్లు శిరీష్ అర్జెంట్ గా ప్రకటించడం.. మరి ఈ వార్త ఎలా బయటకు వచ్చింది..ఎందకు శిరీష్ చేయడం లేదన్నాడో? అందరూ వదిలేసిన ప్రాజెక్ట్ తనకు ఎందుకనా? ఏమో?