శంకరాభరణం సినిమా ఫలితం హీరో నిఖిల్ ను కాస్త హర్ట్ చేసిన మాట వాస్తవం. అయినా బయ్యర్లు సేఫ్ అయిపోతే చాలు అని ప్రచారం కొసం ఊళ్లు పట్టుకుని తిరిగాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ కు సినిమా రూపకర్త కోన వెంకట్ కు బెడిసిందని ముందుగా ఒకటి రెండు వార్తలు వినిపించాయి. కానీ ఇంతలో ఏమయిందో, కోనతో ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కోన డైరక్షన్ లో నిఖిల్ సినిమా చేస్తున్నాడంటూ ఓ గ్యాసిప్ గుప్పుమంది.
కోన పని తీరు చాలా నచ్చిందని, అందుకే మళ్లీ ఆయనతో సినిమా చేస్తా అని నిఖిల్ అన్నాడంటూ వార్తలు పుట్టింది..పెరిగింది..వ్యాపించింది. కానీ నిఖిల్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఇదంతా వట్టిదేనట. నిఖిల్ ప్రస్తుతం ఓ సినిమా కమిట్ అయ్యాడు. టైగర్ సినిమా అందించిన ఆనంద్ చెప్పిన కథ నచ్చి ఓకె చేసాడు. దీన్ని కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. జనవరిలో సెట్ మీదకు వెళ్తుంది. ఆ తరువాత మరో నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానికి కథ, డైరక్టర్ ఓకె కావాలి.
ఇది కాక చందు మొండేటి డైరక్షన్లో కార్తికేయ 2 చేయాల్సి వుంది. అంతే తప్ప కోన సినిమా అన్నది పైప్ లైన్ లో లేదు. కానీ విషయం అది మాత్రమే కాదు, ఎందుకు కోన డైరక్షన్ లో నిఖిల్ సినిమా చేస్తున్నాడంటూ అర్జెంట్ గా గ్యాసిప్ పుట్టింది..ఎవరుపుట్టించారు..ఎందుకు? అన్నది. కోనకు, నిఖిల్ కు చెడింది అన్న వార్తలకు విరుగుడుగా ఈ గ్యాసిప్ కు జీవం పోసారని వినికిడి. అయి వుండొచ్చేమో?