హిందీ టీవీ సీరియల్స్‌లో నటించే అవికా గోర్ వాటి అనువాదాలతో తెలుగు వారికి కూడా దగ్గరైంది. ఆ పాపులారిటీతోనే ఆమె తెలుగు సినిమాల్లో హీరోయిన్ కూడా అయిపోయింది. బాలీవుడ్ అవికని అస్సలు పట్టించుకోకపోయినా కానీ టాలీవుడ్ మాత్రం ఆమెని నెత్తికి ఎక్కించుకుంటోంది. అవిక ఉంటే ఓపెనింగ్స్‌కి గ్యారెంటీ… లేడీస్ థియేటర్లకి వస్తారనే నమ్మకం పెరిగింది మరి.
తనకి ఇక్కడ ఉన్న డిమాండ్ తెలియడంతో అవిక చాలా టెక్కు పోతోందట. తన టర్మ్స్ ప్రకారమే అన్నీ జరగాలని అంటుందట. తనకి నచ్చితే ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందట. లేదంటే మాత్రం అవతలకి పొమ్మంటుందట. తనతో నటించే హీరోలని కూడా అవిక అస్సలు లెక్క చేయదట. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు కూడా ఇంత పొగరుగా ఉండరని, అవికని తట్టుకోవడం కష్టమని చెప్పుకుంటున్నారు.
తనకి సినిమాల్లో నటించడం అవసరం లేదన్నట్టు, హిందీ టీవీ సీరియల్స్‌తోనే చాలా హ్యాపీగా ఉన్నట్టు… ఇక్కడి నిర్మాతలు తన పాపులారిటీని క్యాష్ చేసుకుంటున్నారు కనుక వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు బిహేవ్ చేస్తుందట. ‘లక్ష్మి రావే మా ఇంటికి’ చిత్రానికి కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అందులో అవిక పాత్రే చాలా ఉంది కనుక ఆమెకి ఈ మాత్రం నిక్కు ఉండడంలో వింత లేదు.