‘రేయ్’తో ఆడియన్స్ ముందుకు వస్తున్న సాయిధరమ్‌తేజ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ మోస్తరుగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతున్నా సినిమాలో కాస్తో కూస్తో విషయం ఉండాలి. ‘రేయ్’ ముక్కీ మూలిగీ థియేటర్ల ముందుకొచ్చింది. స్వయానా చిరంజీవే, ‘నా తొలి సినిమా లేటుగా విడుదలైంది. నా మేనల్లుడి సినిమా కూడా అంతే’ అని అన్నారు.
ఒక్కో మావయ్య నుంచీ ఒక్కోటి నేర్చుకున్నానంటూ చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌లను కవర్ చేసిన సాయికితోడుగా పవర్‌స్టార్ భజన బాగానే చేశాడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వైవీఎస్ చౌదరి. ఏం చేసినా, ఈ పబ్లిసిటీ స్టంట్లు వర్కవుటయితేనే ‘రేయ్’కి మనుగడ. అవసరానికి మించి ఖర్చు చేయడం, టైమ్‌కి రిలీజ్ కాకుండా ఆలస్యమవడం వంటివి ‘రేయ్’కి ప్రతిబంధకాలుగా మారాయి.
అవన్నీ దాటి సినిమా గట్టెక్కాలంటే మెగా ఫాన్స్ సపోర్ట్ చాలా ఎక్కువే ఉండాలి. ‘ముకుంద’ సినిమా ఓకే అనిపించుకున్నా ఎందుకో దానికి అభిమానుల సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ సినిమా వచ్చి వెళ్ళిందంతే. ‘పిల్లా నువ్వులేని జీవితం’లో ప్రూవ్ చేసుకోవడం సాయిధరమ్‌కి ప్లస్. హీరోగా అతని రేంజ్ ఏంటనేది రేయ్ డిసైడ్ చేస్తుంది.