గబ్బర్ సింగ్ 2 సూపర్ సానిక్ స్పీడ్ తో రెడీ అవుతోంది. ఎంతలా రెడీ అవుతోంది అంటే, అసలు ఏం తీస్తున్నారో, ఏం చేస్తున్నారో దర్శకుడు బాబికే తెలియనంత అని జోక్ లు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో,. ఎందుకంటే నాలుగు లోకేషన్లలో షూటింగ్ పారలల్ గా జరుగుతోంది. పవన్ ఇలా వస్తున్నారు..అలా అక్కడికి వెళ్తున్నారు..అక్కడ నుంచి ఇంకో దగ్గరకు. ఎక్కడ ఏం జరుగుతోందో..ఆయనకు మాత్రమే క్లారిటీ వుందని వినికిడి. ఇక దాదాపు టాకీ అంతా అయిపోవచ్చింది..రెండుపాటలు మాత్రం డ్యూ వుంది.
ఈనెల 18 లేదా 20న అడియో ఫంక్షన్ చేసి, ఆ వెంటనే విదేశాలకు వెళ్లి పాటలు పూర్తి చేసుకు వస్తారు. అడియో ఫంక్షన్ వేదికపై మల్ల గుల్లాలు పడుతున్నారు. నిన్న మొన్నటి దాకా అమరావతి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అమరావతి భూ గందర గోళ వెలిక్కి వచ్చాక, ఈ టైమ్ లో పవన్ అక్కడకు వెళ్లడం అవసరమా అన్న ఆలోచనలో పడినట్లు వినికిడి. ఈ విషయంలో తుది నిర్ణయం పవన్ కే వదిలేసారు.
అలాగే ఈ అడియో ఈవెంట్ ను మేం చేస్తాం..మేం చేస్తాం అంటూ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలన్నీ వెంటపడుతున్నాయి. అది కూడా ఎవరికి అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.