జనతా గ్యారేజ్ టీమ్ మాంచి జోష్ మీద వుంది. సినిమా వసూళ్లు స్టడీగా వుండడమే ఇందుకు కారణం. సినిమాకు బెనిఫిట్ షో తరువాత వచ్చిన టాక్ చూసి తల్లడిల్లారు. కానీ ఇప్పుడు యూనిట్ మొత్తం పిచ్చ హ్యాపీగా వున్నారు. అందుకే ఇప్పటికే ఓ పార్టీ చేసుకున్న యూనిట్ మరో పార్టీని ఈ నైట్ కు చేసుకుంటోంది.
మొన్నటికి మొన్న ఎన్టీఆర్, దిల్ రాజు, నిర్మాతలు, దర్శకుడు శివ ఇలా కొద్ది మంది మాత్రమే పార్టీ చేసుకున్నారు. ఈరోజు అంటే ఆదివారం రాత్రి ఓ ఫేమస్ పబ్ లొ గ్యారేజ్ లో నటించిన నటులు అందరికీ భారీ పార్టీ ఇస్తున్నారు. ఈపార్టీకి మోహన్ లాల్, నిత్యమీనన్ తప్ప మిగిలిన అందరూ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
పబ్ లో ఎన్టీఆర్ తో పార్టీ అంటే మరి ఆ కిక్కే వేరుగా వుంటుంది. ఇది అయిన తరువాత మీడియాకు కూడా సక్సెస్ మీట్ పేరిట ఓ పార్టీని బుధవారం ఇచ్చే ఆలోచనలో యూనిట్ వున్నట్లు తెలుస్తోంది.