ఈ ఫోటోలు దేనికి వర్మ?

అఖిల్ తో రామ్ గోపాల్ వర్మ టెస్ట్ షూట్ చేసాడన్న వార్త నిన్నే వెల్లడించాం. ఇది ఆధారం చేసుకుని, టెస్ట్ షూట్ కాదు షార్ట్ ఫిలిమ్ అన్న వార్తలు పుట్టుకువచ్చాయి. ఇప్పుడు ఆ టెస్ట్…

అఖిల్ తో రామ్ గోపాల్ వర్మ టెస్ట్ షూట్ చేసాడన్న వార్త నిన్నే వెల్లడించాం. ఇది ఆధారం చేసుకుని, టెస్ట్ షూట్ కాదు షార్ట్ ఫిలిమ్ అన్న వార్తలు పుట్టుకువచ్చాయి. ఇప్పుడు ఆ టెస్ట్ షూట్ కు సంబంధించి మరి కొన్ని వివరాలు తెలిసాయి. వివిధ భంగిమల్లో, కొన్ని గెటప్ ల్లో అఖిల్ ఫోటోలు తీయించాడట రామ్ గోపాల్ వర్మ.

ఒక ఫొటోలో గొలుసులు చేతికి చుట్టుకుని, ఒక ఫొటోలు జుట్టంతా నుదిటిపై నుంచి మొహం పైకి పరుచుకుని, మరో ఫోటోలో మొహం పై నీళ్లు జల్లుకుని, ఆ నీటిబిందువులతో. ఇలా రకరకాలుగా ఫోటోలు తీయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటివి అన్నీ హీరోలు కావాలనుకునే వాళ్లకు, లేదా హీరోగా ఎలా వుంటానో అని సరదా పడేవాళ్లకు చేసే ఫోటో షూట్ లాంటిది.

మరి ఇది వర్మ ఎందుకు అఖిల్ తో చేయించాడో తెలియదు. లైన్ ఏమన్నా చెప్పి, ఇలా చేసాడా? లేదా శివ టైపు సినిమాలో అఖిల్ ఎలా వుంటాడో నాగ్ కు చూపించాలనుకున్నడా? లేక నిజంగానే షార్ట్ ఫిలిం చేస్తున్నాడా? అన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే వున్నాయి.

షార్ట్ ఫిలిం చేయడం అంటే అఖిల్ మరో తప్పటడుగు వేయడమే అన్న గుసగసలు వినిపిస్తున్నాయి. వర్మకు అఖిల్ డేట్ లు ఇచ్చి, సినిమా ఒకె చేసాడు అంటే, అయిపోయినట్లే అనే కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపించడం విశేషం.