జీవిత రాజశేఖర్ తనయగా శివాని సినిమా జనాలకు పరిచయమే. దాదాపు ఒకటి రెండేళ్ల నుంచి హీరోయిన్ కావాలన్నది ప్రయత్నం. ఈ ప్రయత్నంలో సంప్రదించని నిర్మాత లేరు. ప్రాజెక్టు లేదు. కానీ ఏ ప్రాజెక్టు ఒక పట్టాన సెట్ కాలేదు. వీళ్లకు ఓకె అంటే వాళ్లకు ఓకె కాదు, వాళ్లకు ఓకె అంటే వీళ్లకు ఓకె కాదు.
సాయి కొర్రపాటి నుంచి చాలా మంది నిర్మాతలను ట్రయ్ చేసారు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి తమిళంలో ధనుష్ ను కూడా సంప్రదించినట్లు వినికిడి. ఇక చివరకి ఆది సాయి కుమార్ పక్కన నటించాల్సి వస్తుందని వినిపించింది. కానీ చివరాఖరికి అడవి శేషు దగ్గర సెట్ అయింది ఛాన్స్.
నిజానికి అడవి శేష్ పక్కన హీరోయిన్ గా ఎంట్రీ అంటే పెద్ద గొప్ప విషయం కాదు. ఇలాంటి చాన్స్ అయితే శివానికి ఎప్పడో దక్కి వుండేదేమో? ఇన్నాళ్లు వెదికి వెదికి ఇక్కడ సెటిల్ కావడం అంటే ఇక ఏదీ దొరకదని డిసైడ్ అయ్యారేమో? ఏమయినా, ఈ సినిమాలో శివాని స్క్రీన్ ప్రెజెస్స్ ఒక్కటి బాగా ఎలివేట్ అయితే సరిపోదు.
సరైన సినిమాగా మిగలాలి. సినిమా జనాల్లోకి వెళ్లాలి. అప్పుడే కెరీర్ ముందుకు వెళ్తుంది. లేదా చాలా మంది హీరోల డాటర్ ల మాదిరిగా అటు ఇటు కాకుండా వుండే ప్రమాదం వుంది.