ఈసారి ఇంద్రగంటి సినిమా.. ఎవరితో?

ఇంద్రగంటి మోహనకృష్ణ, పెద్దగా ఫెయిల్యూర్ లు లేని మీడియం రేంజ్ డైరక్టర్. క్లాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు పేటెంట్. ఆ మధ్య అమీతుమీ అనే చిన్న సినిమా తీసి ఓకె అనిపించుకున్నాడు. అది…

ఇంద్రగంటి మోహనకృష్ణ, పెద్దగా ఫెయిల్యూర్ లు లేని మీడియం రేంజ్ డైరక్టర్. క్లాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు పేటెంట్. ఆ మధ్య అమీతుమీ అనే చిన్న సినిమా తీసి ఓకె అనిపించుకున్నాడు. అది చూసి ఇప్పుడు యూరోస్ సంస్ధ ఫండింగ్ ఇచ్చి, సినిమా చేసేందుకు ముందుకు వచ్చింది. దాంతో మళ్లీ మరో సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే స్టార్ కాస్ట్ ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు.

సాధారణంగా ఇంద్రగంటి మీడియం రేంజ్ స్టార్ లను దాటి వెళ్లరు. కానీ ఇప్పుడు నాని, శర్వానంద్ తదితర యువ హీరోలు ఎవరూ ఖాళీలేరు. ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలని నిఖిల్-ఇంద్రగంటి అనుకున్నారు. కానీ, ఇప్పుడు నిఖిల్ కిర్రాక్ పార్టీ సినిమాపై వున్నారు. అది అయితే తప్ప ఖాళీ కారు. కనీసం మూడు నెలలు పడుతుంది.

అందుకే స్క్రిప్ట్ రెడీ అవుతోంది. నిర్మాణ సంస్థ రెడీగా వుంది. కానీ ఇంద్రగంటి సినిమాకు స్టార్ కాస్ట్ ఫిక్స్ కాలేదు. నిజానికి ఇంద్రగంటితో చేయాలని నిఖిల్ తో పాటు నాగ చైతన్య కూడా అనుకుంటున్నాడు. నాని మరో సినిమా కాస్త గ్యాప్ తరువాత చేస్తాననీ అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి వుంది. మెయిన్ హీరో ఒక్కటి తేలిపోతే, మిగిలిన స్టార్ కాస్ట్, అవీ చకచకా సాగిపోతాయి.