బాహుబలి అనగానే మాటీవీ గుర్తుకువస్తుంది. ఎప్పుడ పడితే అప్పుడు, బ్యాక్ టు బ్యాక్ రెండు భాగాలు కూడా ప్రసారం చేస్తూవస్తొంది. అలాంటిది ఈటీవీలో బాహుబలి ఏంటీ అని అనుకోవడం సహజం.
అయితే జనం మరచిపోయిన జానపద సినిమాను మళ్లీ అత్యంత భారీగా తీసి చూపించారు రాజమౌళి-ఆర్కా మీడియా కలిసి. జనం విరగబడి చూసారు. అందుకే ఈ సక్సెస్ ఫుల్ ఫార్ములాను టీవీలో కూడా చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
అందుకే ఈటీవీతో కలిసి స్వర్ణఖడ్గం అనే జానపద సీరియల్ ను ఆర్కా మీడియా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా అటు టీవీ సీరియళ్ల రంగంలో కూడా బిజీగా వున్న సంగతి తెలిసిందే. పైగా ఆర్కా మీడియా అధినేతలకు ఈటీవీతో బోలెడు అనుబంధం వుంది. అందుకే ఆ చానెల్ లో ఓ జానపద సీరియల్ ను త్వరలో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
చందమామ పత్రికలో అనేక జానపద సీరియళ్లు వచ్చాయి. అలాంటి కథ ఒకటి అల్లుకుని, స్వర్ణఖడ్గం అనే టీవీ సీరియల్ ను అందిస్తున్నారని వినికిడి. బాహుబలిని ఏ విధంగా భారీగా తీసారో, టీవీ సీరియల్ ను కూడా వీలయినంత గ్రాండియర్ గా తీస్తున్నారట. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో చిన్న చిన్న సెట్ల నిర్మాణం కూడా చేసినట్లు తెలుస్తోంది.