ఇప్పుడు డిఫరెంట్ యంగ్ హీరోలను ఎంగేజ్ చేస్తూ సినిమాలు చేయడం అన్నది టాలీవుడ్ ట్రెండ్ గా వుంది. ప్రస్తుతం షూట్ లో వున్న బోయపాటి శ్రీనివాస్ రామ్ చరణ్ హీరోగా సినిమా కూడా ఇలాంటిదే అని తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ ఒక కీలకపాత్ర పోషిస్తున్నాడని ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రశాంత్ నే కాదు, మరి కొందరు కూడా ఈ సినిమాలో వున్నట్లు తెలుస్తోంది.
ఎందుకుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ముగ్గురు లేదా నలుగురు అన్నదమ్ముల ముద్దుల తమ్ముడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ తో పాటు, నవీన్ చంద్ర, ఆర్యన్ రాజేష్ (ఈవీవీ తనయుడు, అల్లరి నరేష్ అన్న) కూడా సినిమాలో నటిస్తున్నారని వినికిడి. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ 'రఫ్ ఆడించే' స్టయిల్ లో వుంటుందని, అందుకే ఈ అన్నదమ్మలు తమ్ముడికి ఏమీ తెలియనివ్వరని టాక్.
అలాంటి టైమ్ లో విలన్లు వివేక్ ఓబరాయ్, మహేష్ మంజ్రేకర్లతో సమస్య లాంటిది ఏదో వుంటుంది. ఆఖరికి తమ్ముడికి తెలిసి రంగంలోకి దిగి రఫ్ ఆడించేస్తాడు. ఇలాంటిది లైన్ అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఇదంతా వింటుంటే చిరంజీవి గ్యాంగ్ లీడర్ కూడా గుర్తుకు వస్తోంది.
ఏమైనా బోయపాటి కథలు మాంచి ఎమోషన్ తో వుంటాయి. అందునా హీరో రఫ్ ఆడించే క్యారెక్టర్ అంటే మరీ సూపర్ గా వుండే అవకాశం వుంది. మొత్తానికి బోయపాటి సినిమా పుణ్యమా అని ఆర్యన్ రాజేష్ మళ్లీ మరోసారి మొహానికి రంగేసుకుంటున్నాడన్నమాట.