దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఓ ఇంటివారయ్యారు. సినిమాకు పది నుంచి పదిహేనుకోట్లు రెమ్యూనేషన్ తీసుకునే బోయపాటి శ్రీనివాస్ ఇప్పటి దాకా అద్దె అపార్ట్ మెంట్ లోనే వుంటూ వచ్చారు.
యూసఫ్ గుడాలోని ఆయనకు అచ్చివచ్చిన సెంటిమెంట్ అపార్ట్ మెంట్లు రెండింటిని అలాగే అద్దెకు వుంచుకుని, వాటిలోనే ఇల్లు, ఆఫీసు నిర్వహిస్తూవచ్చారు.
అయితే ఇప్పుడు కొండాపూర్ లో మెయిన్ రొడ్ మీద స్వంత బంగ్లా నిర్మించుకున్నారు. సుమారు ఆరుకోట్లకు పైగా వ్యయంతో మాంచి డ్యూప్లెక్స్ ఇల్లును బోయపాటి నిర్మించుకున్నారు.
సాధారణంగా భారీ కట్టడాలు, సెట్ లు, సాంప్రదాయ డిజైన్లు ఇష్టపడే బోయపాటి తన ఇల్లు మాత్రం కాస్త సింపుల్ గానే నిర్మించుకున్నారు. సింపుల్ డిజైన్ తో, వీలయినంత సింపుల్ గా కనిపించేలా కట్టుకున్నారు.
ఈ ఇంటిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయన అతి కొద్ది మంది సన్నిహితులను, కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ప్రస్తుతం తెలుగులో డిమాండ్ వున్న డైరక్టర్లలో బోయపాటి ఒకరు.
ఆయన హీరో రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు. దాని తరువాత మహేష్ తో ఆయనను కలపాలని కొందరు, బాలయ్యతో చేయించాలని మరి కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.