ఈవారం నిల్చునేదెవరు?

ముగ్గురు పోటాపోటీగా వచ్చారు 11వ తేదీన. ఎవ్వరికి ఎవ్వరూ తగ్గలేదు. ఎవరి కారణాలు వారికి వున్నాయి. ఎవరి సమస్యలు వారికి వున్నాయి. ఫలితం చేదుగానే మిగిలింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా బడ్జెట్…

ముగ్గురు పోటాపోటీగా వచ్చారు 11వ తేదీన. ఎవ్వరికి ఎవ్వరూ తగ్గలేదు. ఎవరి కారణాలు వారికి వున్నాయి. ఎవరి సమస్యలు వారికి వున్నాయి. ఫలితం చేదుగానే మిగిలింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా బడ్జెట్ తక్కువ కావడం వల్ల లాభాల బాటలో పయనిస్తోంది.

జయ జానకీ నాయక బడ్జెట్ భారీ కావడం వల్ల, అమ్మకాలు కూడా ఆ రేంజ్ లో జరగడం వల్ల కాస్త కష్టంగా వుంది. లై సినిమా ఈ రెండింటికీ మధ్యస్థంగా వుంది కాబట్టి, పైకి తెలుస్తున్నది వేరు. లోపల మాత్రం కాస్త మార్జినల్ నష్టాలతో నిర్మాతలు బయటపడుతున్నారు.

ఈ సంగతి అలా వుంచితే ఈవారం థియేటర్ల దగ్గర ఎవరి హవా వుంటుందన్నది పాయింట్. నిన్నటికి నిన్న అంటే బుధవారం అన్ని సినిమాలు కాస్త డల్ అయిన మాట వాస్తవం. కానీ ఇప్పటి దాకా తొలివారంలో నేనే రాజు నేనే మంత్రి – జయ జానకీ నాయక పోటా పోటీగా వున్నాయి. తొలివారం కొన్ని ఏరియాల్లో ఈ సినిమా, కొన్ని ఏరియాల్లో ఆ సినిమా డామినేట్ చేసాయి.

మొత్తం మీద ఆంధ్ర, సీడెడ్, నైజాంల్లో నేనే రాజు నేనే మంత్రి 13.55కోట్లు షేర్ సాధించింది. అదే వారంలో ఆంధ్ర, సీడెడ్, నైజాంల్లో జయ జానకీ నాయక 13కోట్లు షేర్ సాధించింది. అంటే జస్ట్ యాభై అయిదు లక్షలు మాత్రమే తేడా. కానీ ఓవర్ సీస్ లొ మాత్రం నేనే రాజు… ఫేర్ చేసినట్లు, జయ జానకీ వసూళ్లు సాగించలేకపోయింది.

ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం రెండో వారం కూడా మరీ తొలి వారం అంతలా కాకపోయినా జయ జానకి వసూళ్లు బాగానే వుంటాయని, రాజు-మంత్రి వసూళ్లు తగ్గే అవకాశం వుంటుంది. అందువల్ల రెండో వారం పూర్తయ్యే సరికి రాజు మంత్రి షేర్ కన్నా, జయ జానకి షేర్ ఎక్కవ వుంటుందని అంటున్నారు. పైగా ఈ వారం సరైన సినిమా లేకపోవడం ఓ అవకాశం.

అయితే ఎక్కువ వున్నా, తక్కువ వున్నా, జయ జానకి బడ్జెట్, అమ్మకాల రీత్యా బయ్యర్లుకు కానీ, ఏరియాలు వుంచుకున్న నిర్మాతకు కానీ కాస్త నష్టం తప్పదని టాక్ వినిపిస్తోంది. లై ఎలాగూ పోటీ లోంచి తప్పుకుంటుంది. రాజు మంత్రి లాభాలు చేసేసుకుంది. జయ జానకి మాత్రం బయ్యర్లు, నిర్మాత ఎవరికైనా సరే, 20 శాతం నష్టాలు మిగులుస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.