ఫిదా సినిమా ఇంకా లాభాలు పండిస్తూనే వుంది బయ్యర్లకు, అలాగే రెండు ఏరియాలు వుంచుకున్న నిర్మాత దిల్ రాజుకు. ఇప్పుడు థియేటర్లలో నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక, లై సినిమాలు వున్నాయి. మరో పక్క ఫిదా వుంది. గతవారం విడుదలైన సినిమాలతో సమానంగా ఫిదా వసూలు చేస్తూనే వుంది. అందువల్ల ఫిదాను థియేటర్లలోంచి తీసే ప్రసక్తి లేదని దిల్ రాజు చెప్పేసారట. దాంతో ఈవారం థియేటర్లలోకి ఒకే ఒక్క సినిమా వస్తోంది.
ఆనందో బ్రహ్మ నిర్మాతలకు యువి క్రియేషన్స్ థియేటర్లు కొంత అండగా వున్నాయి. దిల్ రాజు కొన్ని ఇస్తానన్నారట. ఈ భరోసాతో ఆ ఒక్క సినిమా మాత్రం రంగంలోకి దిగిపోతోంది. అయినా ఆ సినిమాకు కూడా ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది అనుమానంగానే వుంది.
ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి ఆల్ మోస్ట్ విడుదలయిన అన్ని థియేటర్లలో వుంటుంది. అదే విధంగా జయ జానకి నాయక కూడా వుండే అవకాశం వుంది. ఎందుకంటే దానికి దొరికిని థియేటర్లే తక్కువ. ఇక లై కొన్ని ఏరియాల్లో తీసే అవకాశం వుంది. ఆ థియేటర్లు తీసుకోవచ్చు.
అయినా కూడా ఆనందో బ్రహ్మకు సమస్యే. ఎందుకంటే వాళ్లకు నైజాంలో థియేటర్లు కావాలి. మిగిలిన ఏరియాల్లో పెద్దగా వేయాలని అనుకోవడం లేదు. అర్బన్ ఏరియాల్లో మాత్రమే విడుదల చేయాలనుకుంటున్నారు. నైజాంలో కావాలనుకున్నా ఖాళీలేవు. అయితే జస్ట్ మూడు కోట్ల చిన్న బడ్జెట్ తో తయారైన సినిమా కాబట్టి ఏదో విధంగా ముందుకు వెళ్లిపోతారు. సోలో డేట్ దొరకడడే అదృష్టం కదా.