Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈనాడు.. బాహుబలి.. బ్రహ్మోత్సవం

ఈనాడు.. బాహుబలి.. బ్రహ్మోత్సవం

ఈనాడు దినపత్రికను ఓ విషయంలో మాత్రం ఎంతయినా మెచ్చుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలి అంటే, ఇక అహరహం శ్రమిస్తుంది. పేజీలకు పేజీలు అంకింతం ఇస్తుంది..తెలుగుదేశం పార్టీని జీవనపర్యతం భుజాలకు ఎత్తుకున్నట్లే. రామోజీ ఫిల్మ్ సిటీలో రూపొందిన బాహుబలిని ఏ విధంగా గాల్లోకి లేపింది అన్నదీ తెలిసిందే. 

ఇక బాహుబలి చూడకపోతే, పుష్కరాల్లో స్నానం చేయనట్లు, జన్మ ధన్యం కానట్లు అన్నంతగా ప్రచారం సాగించారు. ఇక ఇప్పుడు బ్రహ్మోత్సవం వంతు వచ్చినట్లుంది. తెరవెనుక ఏం ఈక్వేషన్లున్నాయో ఏమో కానీ, గడచిన మూడు నాలుగు రోజులుగా రోజూ ఓ పావుపేజీకి పైగానే బ్రహ్మోత్సవం సినిమాకు అంకితం ఇచ్చేసారు. 

తోటతరణి సారధ్యంలో రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లు వేసారు. ఆ అనుబంధం కూడా కావచ్చు. లేదూ ఈ సినిమా హిట్ అయితే మహేష్ రేంజ్ మరింతగా పెరిగిపోతుంది. శ్రీమంతుడుతోనే మహేష్ సూపర్ డూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఇదీ హిట్ అయితే ఇక చెప్పక్కర్లేదు. 

ఇండస్ట్రీలోని రెండు సామాజిక వర్గాల మధ్య ప్రెస్టీజియస్ వ్యవహారాలు నెలకొన్నాయి. వాటి పర్యవసానం కూడా కావచ్చు. 2019 నాటికి మరీ అత్యవసర పరిస్థితులు వస్తే, పవన్ వేరు కుంపటి పెడితే ఆ రేంజ్ స్టార్ తెలుగుదేశం పార్టీకి అవసరం. మహేష్ అలా స్టాండ్ కావాలంటే ఇప్పటి నుంచి ప్రతి సినిమా హిట్ కావాల్సిందే. ఇలాంటి ఆలోచనలైనా కావచ్చు..మొత్తం మీద రోజూ ఓ బ్రహ్మోత్సవం సెలబ్రిటీతో ఈనాడు సినిమా పేజీ కళకళ  లాడుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?