Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ తెలివే తెలివి

మహేష్ తెలివే తెలివి

శ్రీమంతుడు సినిమా నుంచి స్ట్రాటజీ మార్చాడు మహేష్ బాబు. అంతకు ముందు తన డేట్లు కుటుంబ సభ్యులకు ఇవ్వడం, వాళ్ల ప్రెజెంటేషన్ అంటూ పేరు వేయడం అలవాటు. అలాంటిది ఎంబి బ్యానర్ పెట్టి శ్రీమంతుడులో భాగస్వామి అయ్యాడు. నమ్రత సినిమా పబ్లిసిటీ ప్లానింగ్ అంతా టేకోవర్ చేసింది. సూపర్ సక్సెస్ కొట్టారు. అదే విధంగా బ్రహ్మోత్సవం స్టార్ట్ చేసారు. కానీ మధ్యలోనే అందులో భాగస్వామ్యం వదులుకున్నట్లు వినికిడి. 

బ్యానర్ అయితే వుంది కానీ, ఇప్పుడు సినిమా అవుట్ రేట్ గా పివిపి సంస్థదే అని తెలుస్తోంది. ఈ మేరకు సినిమా సగంలో వుండగానే మహేష్ సెటిల్ మెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అంతే కాదు, త్వరలో ప్రారంభించబోయే మురగదాస్ సినిమాలో కూడా మహేష్ బాబు భాగస్వామ్యం తీసుకోవడం లేదు. ఆ సినిమా బడ్జెట్ వంద కోట్లు. బ్రహ్మోత్సవం బడ్జెట్ 60 నుంచి 70 కోట్లు. 

అంటే దీన్ని బట్టి మహేష్ కు ఎక్కువ రిస్క్ వున్న వాటిల్లో భాగస్వామ్యం ఇష్టం వున్నట్లు కనిపించడం లేదు. శ్రీమంతుడు మాదిరిగా 50 కోట్ల లోపు బడ్జెట్ అయితే మాంచి లాభాలు వస్తాయి. ఇలా 70లు వందలు ఖర్చు చేస్తే రికార్డులు కనిపిస్తాయి. కానీ లాభాలు ఆ రేంజ్ కు పెరిగిపోవు. బహుశా అందుకే కావచ్చు..అలాంటి ప్రాజెక్టులకు మహేష్ అవుట్ రేట్ గా 20 కోట్లు తీసుకుంటున్నాడని వినికిడి. మురగదాస్ సినిమాకు మహేష్ రెమ్యూనరేషన్ అదే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?