ఏం చేసినా ‘తిక్క’ పెరగడంలేదు

ఏదో చినమామయ్య ఊతపదం, జనాల్లోకి బాగా వెళ్లిన పదం అని టైటిల్ ఫిక్స్ చేసుకుని వుండొచ్చు సాయి ధరమ్ తేజ. కానీ అదేమో తిక్క సినిమాకు హైప్ మాత్రం రావడం లేదు. ఎంత చేసినా…

ఏదో చినమామయ్య ఊతపదం, జనాల్లోకి బాగా వెళ్లిన పదం అని టైటిల్ ఫిక్స్ చేసుకుని వుండొచ్చు సాయి ధరమ్ తేజ. కానీ అదేమో తిక్క సినిమాకు హైప్ మాత్రం రావడం లేదు. ఎంత చేసినా దాని గురించి పెద్దగా జనం ఆసక్తి కనబర్చడం లేదు. అదే సుప్రీమ్ సినిమాకు అలా కాదు. ముందు నుంచీ ఆ సినిమాకు ఓ పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాంటి బజ్ తిక్కకు రమ్మన్నా రావడం లేదు. 

ఇటు బ్యానర్ పరిచయం లేనిదే. అటు డైరక్టర్ పేరు పరిచయం లేనిదే. దాంతో ఈ సినిమాకు రావాల్సిన హైప్ మాత్రం రావడం లేదు. ఆఖరికి ఇలా కాదని నిన్నటికి నిన్న పక్క భాష హీరో పేరు తోడు తెచ్చారు. ధనుష్ పాట పాడాడు ఈ సినిమాలో అంటూ. ధనుష్ పాట పాడితే ఈ సినిమాకు ఏంటీ? అసలు ఈ సినిమాలో విషయం ఏమిటి? డైరక్టర్ వ్యవహారం ఏమిటి? సబ్జెక్ట్ ఏమిటి అన్నది వదిలేసారు. 

తిక్క.. తిక్క అంటూ ప్రచారం తప్ప మరో ముక్కలేదు. కానీ జనానికి ఆ టైటిల్ నే అంతగా పట్టలేదు అన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. పవన్ ఊతపదమైనా అది కాస్తా టైటిల్ గా మారేసరికి తమిళ డబ్బింగ్ టైటిల్ గా అనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి. ఇకనైనా సినిమా ప్రమోషన్ కు సినిమా గురించి కాస్తయినా చెప్పడం మంచిదేమో?