Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏం చూపిస్తిరి.. ఏం చూపిస్తిరి?

ఏం చూపిస్తిరి.. ఏం చూపిస్తిరి?

గరుడవేగ తరువాత యాంగ్రీ సీనియర్ హీరో రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో సినిమా టక్కున బిజినెస్ అయిపోయింది. ఆంధ్ర అంతా కలిపి 5.5 కోట్లకు, సీడెడ్, నైజాం, ఓవర్ సీస్ కలిపి ఆరు కోట్లకు అమ్ముడయిపోయింది. తమిళ నటుడు ధనుష్ కు చెందిన కంపెనీ, నిర్మాత రాధామోహన్ ఈ సినిమాను తీసుకున్నారు.

ఇదిలావుంటే ఈ రోజు ట్రయిలర్ ను లాంచ్ చేసారు. రాజశేఖర్ పాపులర్ డైలాగ్ ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి తో ట్రయిలర్ ను స్టార్ట్ చేసి, ఆయన పాపులర్ డ్యాన్స్ స్టెప్ తో ఎండ్ చేసారు. ట్రయిలర్ లో కూడా సినిమా లైన్, సబ్జెక్ట్ ఏమాత్రం బయటపెట్టలేదు. ఒక నిమిషం పది సెకెండ్లు వున్న ఈ ట్రయిలర్ కు కమర్షియల్ ట్రయిలర్ అని టైటిల్ పెట్టారు. అంటే అసలు ట్రయిలర్ మళ్లీ ఇంకోకటి వుంటుందనుకోవాలి.

ఈ నిమిషం పది సెకెండ్ల ట్రయిలర్ లో సినిమాలోని రకరకాల వైవిధ్యమైన పాత్రలను ఎట్ ఎ గ్లాన్స్ పరిచయం చేసారు. మొత్తంమీద సీరియల్ మర్టర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అనిపించేలా వుంది. ఈ నెలాఖరులో విడుదలయ్యే కల్కికి ప్రశాంత్ వర్మ దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?