శ్రీమంతుడులో శృతీ చెప్పింది..మహేష్ చెప్పాడు..ఎంతో కొంత వెనక్కు ఇవ్వాలని,. చిత్రంగా శ్రీమంతుడు విడుదలకు ముందే మహేష్ ఆ పని చేసాడు. ఆగడు సినిమా ఫ్లాప్ తో నష్టపోయిన వారికి తన వంతుగా కొన్ని కోట్లు ఇచ్చి, శ్రీమంతుడు సినిమాకు రూట్ క్లియర్ చేసాడు.
అదే పని డైరక్టర్ గా శ్రీను వైట్ల కూడా చేసాడో..చేయాల్సి వుందో..మొత్తానికి ఆ బాధ్యత అయితే వుంది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత ఎలాగూ నష్టపోతాడు. కాబట్టి ఇక అతని దగ్గర నుంచి వెనక్కు తీసుకునేది ఏమీ వుండదు..అందువల్ల బడా హీరో, డైరక్టర్ నే కాస్తయినా వెనక్కు ఇవ్వాలనే పాయింట్ ఈ మధ్య టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఇప్పుడు ఇదే పాయింట్ కిక్ 2 కూ అమలు అవుతుంది అంటున్నారు. బెంగాల్ టైగర్ విడుదలకు ముందే హీరో రవితేజ, ఆ తరువాత అదృష్టం బాగుండి ఏదైనా సినిమా దొరికితే డైరక్టర్ సురేంద్ర రెడ్డి వెనక్కు ఇవ్వాల్సి వుంటుందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కిక్ 2 సినిమా హీరో రవితేజ 8 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసి తీసుకున్నారని టాక్. ఎందుకంటే ఆ స్వీక్వెల్ చేస్తే, అతనితోనే చేయాలి కాబట్టి.మరి ఇందులో ఎంత వెనక్కు ఇస్తాడో?