Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ..ఒకటి తగ్గి..రెండోది పెరిగి..?

రవితేజ..ఒకటి తగ్గి..రెండోది పెరిగి..?

సినిమా ఫలితం తేడావస్తే, చాలా విషయాల్లో తేడాలు వచ్చేస్తాయి. కిక్ 2 సినిమా హీరో రవితేజ మీద ఇలాంటి రిజల్ట్ నే చూపిస్తోంది. కుర్ర హీరోలతో పోటీ పడాలని, అర్జెంట్ గా బోలెడు కష్టపడి, ఒళ్లు, బరువు తగ్గించుకున్నాడు హీరో రవితేజ. దాంతో మొహంలో ముసిలి కళ వచ్చేసిందని జనం నుంచి కామెంట్లు వినిపించాయి. దీంతో రవితేజ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. మరీ అంత తగ్గిపోతే ఇమేజ్ తగ్గిపోతుందని తెలిసి వచ్చిందని, కాస్త పెరగాలని అనుకుంటున్నాడట.

సరే బరువు తగ్గింది, పెంచుకుందాం అనుకుంటే, మరోపక్క పారితోషిక తగ్గిపోతోందంట. కిక్ 2 కు ముందు అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు అంత రేంజ్ లేదు..కాస్త తగ్గించమని పట్టుపడుతున్నాడట. ఏదో ఒక పాయింట్ దగ్గర సెటిల్ చేసకోవడం అవసరం. ఎందుకంటే చేతిలో బెంగాల్ టైగర్ తప్ప మరో సినిమా లేదు. తరువాత వ్యవహారం ఆ సినిమా ఫలితం పైనే ఆధారపడి వుంటుంది. అందువల్ల బెంగాల్ టైగర్ హిట్ అయితే ఇంత, ఫ్లాపయితే ఇంత అనే స్టయిల్ లో ఒప్పందం చేసుకోవడం బెటరేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?