ఈరోస్ చేతిలో ‘శ్రీమంతుడు’

ప్రఖ్యాత ఈరోస్ సంస్థ 'శ్రీమంతుడు' వరల్డ్ వైడ్ హక్కులను తీసేసుకుంది. సినిమా వచ్చిన క్రేజ్,హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని, 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి…

ప్రఖ్యాత ఈరోస్ సంస్థ 'శ్రీమంతుడు' వరల్డ్ వైడ్ హక్కులను తీసేసుకుంది. సినిమా వచ్చిన క్రేజ్,హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని, 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా జరిగిన అమ్మకాలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఇక ఈరోస్ కే చెందుతాయి. ఈ డీల్ లో ఇటు మహేష్ కు, అటు మైత్రీ మూవీస్ కు మంచి లాభాలు వచ్చాయంటున్నారు. ఈరోస్ గతంలొ కూడా మహేష్ సినిమాలు కొనుగోలు చేసింది. వాటి లావాదేవీలను, మిగులు తగుళ్లను కూడా ఇటీవలే సెట్ చేసుకున్నారు. శ్రీమంతుడు సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా వున్నాయి. మహేష్ పై సినిమా ప్రేక్షకుల్లో క్రేజ్ వుండడం, కొరటాల శివ డైరక్షన్ పై నమ్మకం, పైగా బాహుబలి వచ్చి నెల రోజులు కావస్తోంది. పెద్ద సినిమా కోసం జనం ఎదురు చూస్తుండడం, ప్రస్తుతం థియేటర్లలలో సరైన సినిమా లేకపోవడం వంటి కారణాలున్నాయి. వీటన్నింటి రీత్యా ఈరోస్ సంస్థ భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకుందని, పైగా లాభాల్లో వాటా కూడా మైత్రీకి, ఎంబీకి వుంటుదని అంటున్నారు. సో..ఎంబీ కార్పొరేషన్ కు, మైత్రీకి బోణీ బాగానే వుంది.