పతాక సన్నివేశంలో చిరంజీవి?

రామ్ చరణ్-శ్రీనువైట్ల-దానయ్య కాంబినేషన్ సినిమా పతాక సన్నివేశాలు బ్యాంకాక్ లో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఇంతకీ ఈ పార్ట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు.…

రామ్ చరణ్-శ్రీనువైట్ల-దానయ్య కాంబినేషన్ సినిమా పతాక సన్నివేశాలు బ్యాంకాక్ లో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఇంతకీ ఈ పార్ట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు.

రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి 10 నుంచి 20 నిమషాల కీలక పాత్ర ధరిస్తున్నారని, ఓ ఫైట్ కూడా వుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ యూనిట్ బయటకు తేలేదు. బహుశా చిరంజీవి 60వ బర్త్ డే ఇక ఎంతో దూరంలో లేదు కాబట్టి, ఆరోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, చిరంజీవి విషయం, రివీల్ చేస్తారని వినికిడి.

అందుకే ఈ విషయం ఇంకా గుంభనంగా వుంచారా అన్నది అనుమానం. లేదా, మనంలో అఖిల్ ఫస్ట్ లుక్ విషయం సినిమా విడుదల వరకు ఆపారు. అలాగే చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ సంగతి కూడా దాసారేమో? మరోపక్క టైటిళ్లపై ఊహాగానాలు సాగుతున్నపుడల్లా, దానయ్య ఓ ప్రకటన ఇవ్వడం, ఇంకా ఏ టైటిల్ ఫిక్స్ కాలేదని చెప్పడం ఓ తంతుగా మారింది. ఇలా ఖండించే బదులు ఆ టైటిల్ ఏదో చెప్పేస్తే సరి కదా?