ఈరోస్ డీల్ ఎవరికి, ఎంత లాభం?

ఈరోస్ సంస్థకు కార్పొరేట్ స్ట్రాటజీ ఏదో వుంది. అందుకోసమే లాస్ట్ మినిట్ లో ఎంటరై, టర్నోవర్ అమౌంట్ మొత్తం చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకుని, ఓవర్ ఫ్లోస్ లో ఫిఫ్టీ, ఫిఫ్టీ అంటూ షేర్ తీసుకుంటూ…

ఈరోస్ సంస్థకు కార్పొరేట్ స్ట్రాటజీ ఏదో వుంది. అందుకోసమే లాస్ట్ మినిట్ లో ఎంటరై, టర్నోవర్ అమౌంట్ మొత్తం చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకుని, ఓవర్ ఫ్లోస్ లో ఫిఫ్టీ, ఫిఫ్టీ అంటూ షేర్ తీసుకుంటూ వుంటుంది. ఆ మధ్య శ్రీమంతుడు సినిమా విషయంలో అలాగే చేసింది. ఇప్పుడు సాక్ష్యం సినిమాను అలాగే తీసుకుంది. ఈ డీల్ వల్ల ఎవరికి ఎంత లాభం అన్నది చూస్తే, ఇటు నిర్మాతకు టెన్షన్ ఫ్రీ, అటు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు అదనపు ప్లస్ పాయింట్ అనుకోవాలి.

నిర్మాతకు ఎందకు టెన్షన్ ప్రీ అంటే, కమిట్ అయిన మొత్తాలు బయ్యర్లు లాస్ట్ మినిట్ లో కట్టేటపుడు బేరాలు ఆడడం, చేతులు ఎత్తడం, కాస్త కట్ చేయడం ఇవన్నీ టాలీవుడ్ లో కామన్. ముఖ్యంగా భారీ రేట్లుకు సినిమాలు తీసేసుకుని, చివరి నిమిషంలో ఫోన్ లు ఆపేసి, గాయబ్ అయ్యే బాపతు జనాలు కూడా వున్నారు. ఇప్పుడు సాక్ష్యం నిర్మాత అభిషేక్ పిక్చర్స్ కు ఇలాంటి సమస్యలు వుండవు. అలాగే అమ్మకుండా కృష్ణాజిల్లాను స్వంతానికి ఉంచుకోవాల్సి వచ్చింది. ఇప్పడు ఈ తలనొప్పి కూడా యూరోస్ చూసుకుంటుంది. ఓవర్ ఫ్లొస్ సంగతి తరువాత, ముందు రిలీజ్ హెడ్ ఏక్ లు అన్నీపోతాయి.

ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు మరింత ప్లస్. ఎందుకంటే ఇప్పటిదాకా టాప్ లైన్ హీరోల సినిమాలు మాత్రమే యూరోస్ తీసుకుంటోంది. టాప్ లైన్ హీరోల తరువాత 40కోట్ల రేంజ్ మార్కెట్ ను వరుసగా జయజానకీ నాయక, సాక్ష్యం సినిమాలో ఈ హీరో సాధించాడు. మరే యంగ్ మీడియం హీరో సాధించలేదు. ఇప్పుడు యూరోస్ ఇతగాడి సినిమా కొనడం ద్వారా మరింత బిజినెస్ పెరుగుతుంది. రాబోయే రెండు సినిమాలకు ఇది ప్లస్ అవుతుంది.

చిత్రమేమిటంటే యూరోస్ వచ్చిందని అభిషేక్ పిక్చర్స్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హ్యాపీనే. కానీ అది రావడానికి అసలు కారణం, ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ కు యూరోస్ తో వున్న సంబంధాలే అన్నది బయటకు రాలేదు. శ్రీవాస్ కు డిక్టేటర్ టైమ్ లోనే యూరొస్ వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ఫండింగ్ చేస్తాం, సినిమాలు తీస్తే కొంటాం అని. కానీ అప్పట్లో అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఇలా అది కలిసివచ్చింది.