ఎక్స్ క్లూజివ్: రాజమౌళి సినిమా కథ ఎవరిది?

దర్శక దిగ్గజం సినిమాకు కథ ఎవరు ఇస్తారు? సినిమా పరిజ్ఞానం వున్న ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఒకటే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి ఇంట్లోని సమస్త పరివారం కలిసి కథల డిస్కషన్…

దర్శక దిగ్గజం సినిమాకు కథ ఎవరు ఇస్తారు? సినిమా పరిజ్ఞానం వున్న ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఒకటే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి ఇంట్లోని సమస్త పరివారం కలిసి కథల డిస్కషన్ లో పాల్గొనడం, కథ వంటకం తయారుచేయడం మామూలే. కానీ కథ విజయేంద్ర ప్రసాద్ అనే వుంటుంది.

అయితే ఫస్ట్ టైమ్ ఫర్ ఏ ఛేంజ్ ఈసారి కథకు పేరు వేరే పడుతోంది. ఆ పేరు ఎవరిదో కాదు. రాజమౌళికి టాలీవుడ్ లో మొదట ఆశ్రయం ఇచ్చిన పెద్దాయన గుణ్ణం గంగరాజు.

అమృతం సీరియల్, ఐతే వంటి సినిమాల ద్వారా ఆయన పేరు సుపరిచితమే. రాజమౌళి కుటుంబానికి గుణ్ణం గంగరాజుతో మంచి సంబంధాలు వున్నాయి. అలాంటి గుణ్ణం గంగరాజు పెట్టుకున్న ఓ లైన్ ను తీసుకుని, రాజమౌళి అండ్ టీమ్ డెవలప్ చేసి స్క్రిప్ట్ గా మార్చారట.

ఇప్పటికే రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా కథ గురించి తెలియచేసాం. 1980 ఒలంపిక్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అది. అందులో ఎన్టీఆర్ బాక్సర్ గా, రామ్ చరణ్ హార్స్ రైడర్ గా కనిపిస్తాడు.