లీకులతో ఒరిగేదేమిటీ?

పెద్ద వాళ్లు తింటే ఫలహారాలు. చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు పెద్దవాళ్లు మందు కొడితే కల్చర్. చిన్నవాళ్లు కొడితే తాగుబోతు Advertisement మన సమాజం ఇలాంటి ద్వంద ప్రమాణాలకు ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు…

పెద్ద వాళ్లు తింటే ఫలహారాలు. చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు
పెద్దవాళ్లు మందు కొడితే కల్చర్. చిన్నవాళ్లు కొడితే తాగుబోతు

మన సమాజం ఇలాంటి ద్వంద ప్రమాణాలకు ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు శ్రీరెడ్డి కావచ్చు లేదా మరొకళ్లు కావచ్చు. లీకులు చేసి ఒరిగేదేమీ వుండదు. మీడియాకు కాస్త వార్తలు. జనాలకు కాస్సేపు కాలక్షేపం. టాలీవుడ్ లో ఇప్పుడు సురేష్ బాబు అంటే వుండే భయం కానీ, గౌరవం కానీ ఏమాత్రం అన్నా తగ్గుతుందా? వాళ్ల పనులు ఏమన్నా ఆగిపోతాయా?

ఓటుకు నోటు అన్నారు. సాక్ష్యాలు అన్నారు. వాయిస్ రికార్డులు అన్నారు. ఏమయింది?
మత్తుపదార్థాలు, నార్గొటిక్ కేసులు హడావుడి? ఏమయింది?
నారా లోకేష్ విదేశీ వనితలతో పార్టీలు, హగ్గులు, ఫొటొలు. ఏం జరిగింది?
బాలయ్య స్పీచ్ లు, చలపతిరావు కామెంట్ లు, రాథిక ఆంప్టే బయట పెట్టిన విషయాలు. ఏం జరిగింది?
జగన్ అరెస్ట్, కేసలు ఎక్కడ ఎలా వున్నాయి?

పెద్దవాళ్లకు ఏమీ జరగదు. ఏమీ ఒరగడదు. మన మీడియా వీలయినంత హడావుడి చేసి, ఆపై వదిలేస్తుంది. ఒక వేళ మన 99శాతం సామాజిక వర్గ మీడియాకు నచ్చకపోతే మాత్రం దశాబ్దాల తరబడి సాగదీస్తుంది.

తన ఆఫర్ల కోసం తన ఇష్టంతో పడుకున్నా తప్పుకాదు అని కోర్టులు తీర్పులు ఇచ్చిన రోజులున్నాయి. శ్రీరెడ్డి అవతలి వాళ్లకు నో అనకుండా, ఆఫర్ల కోసం తన శరీరాన్ని ఆఫర్ ఇచ్చేసినపుడు అది కోర్టులో ఏ మేరకు నిల్చుంటుంది? అన్నది అనుమానం. అసలు ఇది కోర్టుదాకా వెళ్తే కదా? మహా మహా కేసులే ఇంకా విచారణలో నీరు కారుతున్నాయి. దానికి కారణం అంగబలం, అధికార బలం.

అందువల్ల ఈ లీకులతో ఏమీ కాదు. మరింత పాపులారిటీ తప్ప.