ఎక్స్ క్లూజివ్-థియేటర్ కొన్న త్రివిక్రమ్

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సినిమాకు పదిహేను కోట్లు రెమ్యూనిరేషన్ వచ్చినపుడే ఓ రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. సినిమా రంగంలో సీనియర్లను చూసి ఈ కాలం జనరేషన్ జనాలు నేర్చుకున్నది ఇదే. దర్శకుడు త్రివిక్రమ్…

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సినిమాకు పదిహేను కోట్లు రెమ్యూనిరేషన్ వచ్చినపుడే ఓ రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. సినిమా రంగంలో సీనియర్లను చూసి ఈ కాలం జనరేషన్ జనాలు నేర్చుకున్నది ఇదే. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ బాటలోనే వున్నారు.

ఆది నుంచి మంచి పెట్టుబడులు పెడుతూనే వున్నారు త్రివిక్రమ్. హైదరాబాద్ శివార్లలో భూములు కొన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ ఓనర్ కూడా అయ్యారు. ఇటీవలే ఆరుకోట్లు పెట్టి ఈస్ట్ గోదావరి రాజానగరంలో ఓ థియేటర్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నారు. ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. రాయుడు థియేటర్ అనే దీన్ని లాస్ట్ ఇయర్ నే రిన్మోవేట్ చేసారు.

లాస్ట్ ఇయర్ ఇదే థియేటర్ ను మూడున్నర కోట్లకు అమ్మచూపారు. కానీ అప్పట్లో అమ్ముడుకాలేదు. అదే థియేటర్ ను ఇప్పుడు త్రివిక్రమ్ 4.90 కోట్లకు కొన్నట్లు బోగట్టా. ఎందుకంటే అక్కడ లాండ్ కాస్ట్ నే 2.50 కోట్ల వరకు వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు 15 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటారని టాక్ వుంది.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?