Advertisement

Advertisement


Home > Politics - Gossip

పాపం చంద్రబాబు : ఎంత తేడా? ఎంత తేడా?

పాపం చంద్రబాబు : ఎంత తేడా? ఎంత తేడా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఏ చిన్న మీటింగు పెట్టినా చాలా వైభవంగా దానిని నిర్వహించడం అలవాటు చేసుకున్నారు. ఇన్నాళ్లూ అధికారం ఉంది.. చుట్టూతా లెక్కకు మిక్కిలిగా వందిమాగధులు ఉన్నారు. ఏతావతా ఆయన చాలా డాంబికంగా ప్రతి సమావేశాన్నీ నిర్వహిస్తూ వచ్చారు. ఆ వైభవంలో మాత్రమేకాదు... ఆయన మీటింగుకు హాజరయ్యే సభ్యుల సంఖ్య పరంగా కూడా ఇప్పుడు చాలా తేడా కనిపిస్తోంది. ఆ తేడా గమనిస్తే.. అయ్యో పాపం చంద్రబాబు అనిపించక మానదు.

ఇవాళ్టి నుంచి ఏపీ శాసనసభ మొదలవుతున్న నేపథ్యంలో తన పార్టీ సహచరులతో చంద్రబాబు సన్నాహక సమావేశాలు పెట్టుకున్నారు. ఒకరోజు శాసనమండలి సభ్యులతోనూ, మరొకరోజు శాసనసభ సభ్యులతోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు గురించి చర్చించారు. అసలు ఈ రెండు సమావేశాల మధ్య ఉన్న వ్యత్యాసం గమనిస్తేనే పాపం అనిపించేలా ఉంది.

శాసనసమండలి సమావేశం పెట్టుకున్నప్పుడు.. ఓ మోస్తరు ఏర్పాట్లతో కాస్త డాబుగా అనిపించేలాగానే నిర్వహించారు. నిజానికి తెలుగుదేశానికి శాసనమండలిలో బలం బాగానే ఉంది. దానికి తగ్గట్లుగానే ఆ సమావేశం జరిగింది. శాసనసభలో మనకు సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని... మండలిలోనే ప్రతిపక్షం గళాన్ని బలంగా వినిపించడానికి ప్రయత్నించాలని చంద్రబాబు వారికి హితబోధ చేశారు.

తర్వాతి రోజున తెదేపా శాసనసభ్యుల సమావేశం జరిగింది. పార్టీకి ఉన్నదే 23 మంది ఎమ్మెల్యేలు. దాంతో ఓ చిన్నగదిలో ఏదో నామ్ కే వాస్తీగా అందరినీ కూర్చోబెట్టి సమావేశం ముగిసినట్లుగా మమ అనిపించారు. ఉన్న 23 మందిలో నమ్మకంగా పార్టీలోనే మిగిలి ఉంటారని అనుకుంటున్న కొందరికి చంద్రబాబునాయుడు శాసనసభలో ఉపనేత పదవులు, విప్ పదవులను కూడా పంచిపెట్టారు. ఉన్నవారిని కాస్త పదవులతో సంతోషపరచి, వీడిపోకుండా కాపాడుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుంది.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?