అనిల్ రావిపూడి అంటే 'హు..హు..హూ..హూ..' 'అంతేగా..అంతేగా' లాంటి క్యాచీ ఊతపదాలు గుర్తుకు వస్తాయి. అలాంటి పదాలతోనే రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి సినిమాల్లో నవ్వులు రువ్వించేసారు. మరి అలాంటి అనిల్ రావిపూడి ఇప్పుడు ఏం చేయబోతున్నారు. మహేష్ బాబు తో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏం వినిపించబోతున్నారు?
ఎక్స్ క్లూజివ్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కు ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ వుంటుంది. అప్పుడప్పుడు ఆ మూవ్ మెంట్స్ చూపిస్తుంటారు. ఇది కాక, గతంలో 'అంతేగా..అంతేగా..' అంటూ వెంకీ-వరుణ్ ల అత్తింటివారికి ఊతపదం పెట్టినట్లుగానే సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మహేష్ అత్తింటివారికి ఓ ఊతపదం పెట్టినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ రష్మిక తల్లి వైపు వారు తరచు ఈ ఊతపదం వాడుతుంటారని తెలుస్తోంది. 'నెవ్వర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్' అనే టైపులో ఈ ఊతపదం ఏదో వుంటుందని తెలుస్తోంది. తరచు..'బాబు..నెవ్వర్..బిఫోర్..నెవ్వర్ ఆఫ్టర్' అంటుంటారని తెలుస్తోంది.
మొత్తం మీద అనిల్ రావిపూడి మహేష్ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడానికి తన సర్వశక్తులూ వాడుతున్నట్లే వుంది.