ఎక్స్ క్లూజివ్.. రిటైర్డ్ డాన్ గా నాగ్

నాగ్ ఒప్పుకునే ప్రతి సినిమా విషయంలో కేర్ గా వుంటాడు. ఒప్పుకన్నవి అన్నీ విజయం సాధిస్తాయా? లేదా? అన్నది పక్కన పెడితే, తన క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ గా వుండేలా చూసుకుంటాడు. లేటెస్ట్ గా…

నాగ్ ఒప్పుకునే ప్రతి సినిమా విషయంలో కేర్ గా వుంటాడు. ఒప్పుకన్నవి అన్నీ విజయం సాధిస్తాయా? లేదా? అన్నది పక్కన పెడితే, తన క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ గా వుండేలా చూసుకుంటాడు. లేటెస్ట్ గా నాని కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మాణంలో చేయబోయే మల్టీస్టారర్ లో కూడా నాగ్ ది వైవిధ్యమైన పాత్రేనట.

ఆ సినిమాలో నాగ్ రిటైర్డ్ డాన్ గా కనిపిస్తాడట. మిగిలిన కథ అంతా చాలా వుంది కానీ, కీలకంగా నాగ్ మాత్రం రిటైర్డ్ డాన్ గా వుంటూ, తప్పని సరై రంగంలోకి దిగి హీరోకి సాయపడే పాత్ర పోషిస్తున్నాడు. ఎమోషన్లు, యాక్షన్, ఇలా చాలా షేడ్ లు వుంటాయి ఈ పాత్రలో. జస్ట్ 53రోజుల షూటింగ్ డేస్ తో పూర్తవుతుందీ సినిమా.

మార్చిలో స్టార్ట్ అయి ఏప్రియల్ నెలాఖరుకు పూర్తయిపోతుందని తెలుస్తోంది. అంటే సమ్మర్ లో ఒకటి, దసరా టైమ్ లో మరొకటి నాని సినిమాలు వచ్చే అవకాశం వుంది. గత ఏడాది నాని మూడు సినిమాలు అందించాడు. ఈ ఏడాది కూడా చూస్తుంటే అలాగే అందించేలా వున్నాడు.