ఇప్పటికి నాలుగు డేట్లు మారాయి ఆర్ఆర్ఆర్ విడుదలకు. మొదటి నుంచీ ఈ విషయంలో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ఇస్తూనే వున్నాం.
అక్టోబర్ కు ఆర్ఆర్ఆర్ రావడం కష్టమని వెల్లడించాం. ఇప్పుడు లేటెస్ట్ డేట్ పై అప్ డేట్ గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకుల కోసం.
ఆర్ఆర్ఆర్ ను 2022 ఉగాదికి విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ మేరకు అధికారికంగా ప్రకటించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రకటన ఎప్పుడు వుంటుందన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
మొత్తానికి ఈ అక్టోబర్ కు రావడం లేదన్నది పక్కాగా తెలుస్తున్న విషయం. అలాగే సంక్రాంతి బరిలోకి కూడా రావడం లేదన్నది పక్కా. సంక్రాంతి సినిమాలను డిస్టర్బ్ చేయము అని ఇప్పటికే రాజమౌళి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.